ETV Bharat / bharat

'కరోనా అనంతరం పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి'

కరోనా తర్వాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. కరోనాతో ఇటలీలో మృతి చెందిన వారికి భారతీయుల తరఫున సంతాపం తెలిపారు. శుక్రవారం జరిగిన భారత్​-ఇటలీ వర్చువల్​ సదస్సులో ప్రసంగించారు మోదీ.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Nov 6, 2020, 8:05 PM IST

రెండో ప్రపంచ యుద్ధం మాదిరిగానే కొవిడ్​-19 మహమ్మారి ఒక చారిత్రక మలుపుగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా అనంతరం పరిస్థితులను స్వీకరించేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఇటలీ ప్రధానమంత్రి గియుసేప్​ కాంటేతో వర్చువల్​గా నిర్వహించిన సమావేశంలో మోదీ పలు అంశాలపై చర్చించారు.

కరోనాతో ఇటలీలో ప్రాణాలు కోల్పోయిన వారికి భారతీయుల తరఫున సంతాపం తెలిపారు ప్రధాని మోదీ. ప్రపంచంలోని ఇతర దేశాలు కరోనా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ వైరస్​తో ఇటలీ ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. దేశం మొత్తాన్ని సంఘటితం చేసి.. చాలా కష్టమైన పరిస్థితిని వేగంగా.. విజయవంతంగా అదుపులోకి తెచ్చారని కితాబిచ్చారు.

కొవిడ్​ పరిస్థితి మెరుగుపడిన తర్వాత.. భారత్​కు ఇటాలియన్​ పార్లమెంట్​ సభ్యులను స్వాగతిస్తామన్నారు మోదీ.

ఇదీ చూడండి: విద్యార్థుల 'వ్యర్థ కళ'కు ప్రపంచ గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.