ETV Bharat / bharat

దేశంలో అత్యల్ప స్థాయికి కొవిడ్ మరణాల రేటు - ప్రపంచంలోనే అతి తక్కువ కొవిడ్ మరణాల రేటు

దేశంలో కొవిడ్​ మరణాల సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్ఖ ప్రమాణాల ప్రకారం.. భారత్​లో అత్యల్పంగా 1.5 శాతంగా నమోదైనట్లు తెలిపింది.

case fatality rate lowest since March 22 in India
దేశంలో అత్యల్పంగా కొవిడ్ మరణాల రేటు
author img

By

Published : Oct 26, 2020, 6:13 PM IST

దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. మార్చి​ 22 నుంచి ఇదే అత్యల్ప రేటు అని.. ఇది క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు తెలిపింది.

'ప్రపంచంలోనే భారత్​ అతి తక్కువ మరణాల రేటు ఉన్న దేశం. ఒక్క రోజులో 500 కన్నా తక్కువ (480) మరణాలు నమోదయ్యాయి.' అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో కొవిడ్​తో 1,19,014 మంది మృతి చెందారని వివరిచింది.

వ్యాధి తీవ్రతను కొలిచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ప్రమాణమే ఈ సీఎఫ్​ఆర్ (కేస్​ ఫెటాలిటీ రేటు). మొత్తం కొవిడ్ కేసులు, మరణాల నిష్పత్తి ఆధారంగా దీనిని లెక్కిస్తారు.

14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీఎఫ్​ఆర్ 1 శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి:దేశంలో కొత్తగా 45,149 కేసులు.. 480 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.