ETV Bharat / bharat

దేశంలో రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా కేసులు - #covid-19

భారత్​లో కరోనా కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 29,164 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 449 మంది కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయారు.

Covid-19 cases decreased in the nation
దేశంలో రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా కేసులు
author img

By

Published : Nov 17, 2020, 9:33 AM IST

దేశంలో కొవిడ్​ కేసులు రికార్డు స్థాయిలో తగ్గుతున్నాయి. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య తగ్గుతుండటం ఊరటనిస్తోంది. దేశంలో తాజాగా 29,164 కేసులు నమోదవ్వగా.. మరో 449 మంది మరణించారు.

మొత్తం కేసులు: 88,74,291

మొత్తం మరణాలు: 1,30,519

మొత్తం కోలుకున్నవారు: 82,90,371

కరోనా నివారణకు ప్రభుత్వాలు చూపిన చొరవ.. తీసుకున్న చర్యల ఫలితంగానే వైరస్​ కేసులు తగ్గాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల కంటే రికవరీలే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 40,791 మంది మహమ్మారిని జయించినట్లు వెల్లడించింది.

కొవిడ్ నివారణలో భాగంగానే భారీ సంఖ్యలో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా 8,44,382 టెస్టులు చేయగా.. మొత్తం పరీక్షల సంఖ్య 12 కోట్ల 62 లక్షల 43 వేలకు చేరువైంది.

ఇదీ చూడండి: '30 సెకన్లలో బస్సుల్లో అగ్నిప్రమాదాల నియంత్రణ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.