ETV Bharat / bharat

మాస్క్​ లేకుండా తుమ్మినందుకు దేహశుద్ధి! - maharashtra Man Riding Bike Beaten Up For Not Wearing mask

మాస్క్​ లేకుండా తుమ్మినందుకు ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు మహారాష్ట్రకు చెందిన దంపతులు. కరోనా జాగ్రత్తలు పాటించాలనే కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన వ్యక్తిని రోడ్డుపైనే నిలదీశారు.

Coronavirus scare: Man beaten up for not wearing mask, sneezing in public in Maharashtra
మాస్క్​ లేకుండా తుమ్మినందుకు దేహశుద్ధి!
author img

By

Published : Mar 20, 2020, 11:29 AM IST

Updated : Mar 20, 2020, 4:34 PM IST

మాస్క్​ లేకుండా తుమ్మినందుకు దేహశుద్ధి!

'నిర్లక్ష్యం... మాస్కులు వేసుకోమంటే నిర్లక్ష్యం. చేతులు కడుక్కోమంటే నిర్లక్ష్యం. కనీసం తుమ్మినప్పుడు చేతులు అడ్డు పెట్టుకోమంటే నిర్లక్ష్యం. ఇలా కరోనా జాగ్రత్తలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్లపై తిరిగితే.. మా ఆరోగ్యాలు ఏం కావాలి?' అంటూ... మాస్క్​ లేకుండా తుమ్మిన ఓ వ్యక్తి తాటతీశారు మహారాష్ట్ర​కు చెందిన దంపతులు.

ఓ వైపు కరోనా యావత్​ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇలాంటి సమయంలో కొల్హాపుర్​లోని గుజారీ​లో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి కరోనా జాగ్రత్తలను పెడచెవినపెట్టాడు. ముఖానికి మాస్క్​లేకుండా, కనీసం చేతులు అడ్డుపెట్టుకోకుండా నడిరోడ్డుపై తుమ్మాడు.

అతడి పక్కనే మరో బైక్​పై వెళ్తున్న దంపతులు ఇదంతా గమనించి.. మాస్క్​ ధరించి తుమ్మాలని సలహా ఇచ్చారు. అంతే, ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.

"జాగ్రత్తలు పాటించకుండా తుమ్మడమే తప్పు, పైగా వాదిస్తావా" అంటూ.. తుమ్మిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు దంపతులు. సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది.

ఇదీ చదవండి:ప్రపంచ మహమ్మారి కరోనాపై మహా సంగ్రామం!

Last Updated : Mar 20, 2020, 4:34 PM IST

For All Latest Updates

TAGGED:

Coronavirus
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.