దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 90వేలకు పైనే నమోదవుతున్నాయి. కొత్తగా 92,071 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,136 మంది కొవిడ్‌కు బలయ్యారు.
![Coronavirus fresh cases and death toll in India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8791677_covid-19.jpg)
మరణాలు రేటు క్రమంగా తగ్గుతూ 1.64 శాతానికి చేరింది. రికవరీ రేటు కూడా 78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. సరైన సమయంలో రోగులను గుర్తించి, మెరుగైన చికిత్స అందించడం వల్లే ఈ మేరకు సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
![Coronavirus fresh cases and death toll in India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8791677_india.jpg)
ఇదీ చూడండి: విశ్వసనీయ వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు!