ETV Bharat / bharat

భారత్​లో 151కి చేరిన కరోనా కేసులు- అంతటా బంద్​

ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్​ వ్యాప్తి భారత్​లోనూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 151 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ.​

Coronavirus cases in country climb to 151
భారత్​లో 151కు చేరిన కరోనా కేసులు- సర్వాత్రా బంద్​
author img

By

Published : Mar 18, 2020, 8:10 PM IST

Updated : Mar 19, 2020, 10:16 AM IST

చైనాలో ప్రారంభమై ప్రపంచదేశాలకు విస్తరిస్తోన్న కరోనా ఇప్పుడు భారత్​లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా 151 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ మహమ్మారి నివారణకు ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, థియేటర్లు, వేడుక మందిరాలు మూతపడుతున్నాయి.

దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రలలో ఒక్కొక్కటి చొప్పున కరోనా మరణాలు నమోదయ్యాయి. అనుమానితులు 5,700 మందికి పైగా పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది మంత్రిత్వ శాఖ.

ఆయా రాష్ట్రాల్లో కేసులు ఇలా..

దేశవ్యాప్తంగా అత్యధికంగా మహారాష్ట్రలో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. దిల్లీలో 10, ఉత్తర్​ప్రదేశ్​లో 16, కేరళలో 27, కర్ణాటకలో 11 మంది బాధితులున్నారు. జమ్ముకశ్మీర్​లో 3, లద్దాఖ్​లో 8, తెలంగాణలో 6, రాజస్థాన్​లో 4, హరియాణాలో 17, ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, ఉత్తరాఖండ్​, పంజాబ్​లలో ఒక్కో కేసు నమోదైంది.

కేరళకు చెందిన ముగ్గురితో సహా దేశవ్యాప్తంగా 14 మందిని డిశ్చార్జి చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం నుంచి అఫ్గానిస్థాన్​​, ఫిలిప్పీన్స్​, మలేసియా, ఐరోపా సమాఖ్య​, టర్కీ, యూకే ప్రయాణికులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

తమిళనాడులో రెండో కేసు

తమిళనాడులో రెండో కేసు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మొదటి కేసు బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే అతడిని డిశ్చార్జి చేయనున్నట్లు తెలిపారు.

దక్షిణాదిలో అన్నిసంస్థలపై ఆంక్షలు

దక్షణాది రాష్ట్రాల్లో అన్ని సంస్థలపై ఆంక్షలు విధించారు. విదేశాలనుంచి వచ్చే పలు విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహించి తగిన చర్యలు చేపడుతున్నాయి ప్రభుత్వాలు. విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్​ మాల్స్​​, వేడుక మందిరాలు అన్నింటినీ మూసివేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని అన్ని సంస్థలు మూతపడ్డాయి. ​

విస్తారా సేవలు బంద్​..

ఈ నెల 20 నుంచి 31 వరకు అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు విస్తారా ఎయిర్​లైన్స్​ ప్రకటించింది. అప్పటి వరకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు నగదు తిరిగి వెనక్కి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నెల పాటు భాజపా ర్యాలీలు, నిరసనలు బంద్​

Last Updated : Mar 19, 2020, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.