దేశంలో కొవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. కొత్తగా 62 వేల 538 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. మరో 886 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 41 వేలు దాటింది.
రికవరీ రేటు ఇలా..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రికవరీ రేటులో పెరుగదల నమోదవ్వగా.. మరణాల రేటు కాస్త ఊరటకలిగిస్తోంది. దేశంలో రికవరీ రేటు 67.98 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.05 శాతంగా నమోదైంది.
9 రోజుల్లోనే 5లక్షల కేసులు..
గడిచిన తొమ్మిది రోజుల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా ఐదు లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి 21రోజుల సమయం పడుతోంది.
ఇదీ చదవండి: 'కరోనా రోగులపై పని చేయని ప్లాస్మా చికిత్స'