భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో 2,573మంది వైరస్ బారిన పడ్డారు. 83మంది కొత్తగా ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో 12,974, గుజరాత్-5,428, దిల్లీ-4,549, మధ్యప్రదేశ్-2,942, రాజస్థాన్-2,886, తమిళనాడు-3,023, ఉత్తర్ప్రదేశ్-2,742 మంది వైరస్ బారిన పడ్డారు. తమిళనాడులో కొత్తగా 527మందికి వైరస్ సోకింది. అక్కడ మొత్తంగా వైరస్ బాధితుల సంఖ్య 3,550కి చేరింది.