దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే 527 మంది వైరస్ బారినపడ్డారు. ఇందులో చెన్నై అన్నానగర్ డీసీపీ కూడా ఉండటం స్థానిక పోలీసులను కలవరపెడుతోంది.
కరోనా లాక్డౌన్లో భాగంగా.. కోయంబేడు మార్కెట్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ స్థాయి అధికారికి సోమవారం కొవిడ్ నిర్ధరణ అయింది. 2 రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్న డీసీపీ.. ఆసుపత్రిలో చేరగా కొవిడ్ పరీక్షల్లో వైరస్ ఉన్నట్లు తేలింది. గత కొద్దిరోజులుగా ఇదే ప్రాంతంలో చాలా మంది వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన.. కిల్పౌక్ వైద్య ఆసుపత్రిలో(కేఎంసీ) చికిత్స తీసుకుంటున్నారు.
పోలీసుల్లో భయం భయం..
చెన్నై పారిశుద్ధ్య విభాగ సిబ్బంది.. డీసీపీ కార్యాలయ ప్రాంగణాన్ని శానిటైజ్ చేశారు. ఆ డీసీపీ నేృతృత్వంలో విధులు నిర్వర్తించిన ఇతర పోలీసులు, సిబ్బందిని ఐసోలేట్ చేశారు అధికారులు. పోలీస్ అధికారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించే పనిలో పడ్డారు.