ETV Bharat / bharat

కరోనా రక్కసిపై సీసీఎంబీ బహుముఖ యుద్ధం - covid-19 latest news

దేశం నుంచి కరోనా వైరస్​ను పారదోలడానికి పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్​లోని సెంటర్​ ఫర్​ సెల్యులార్​ అండ్​ మాలిక్యులర్​ బయాలజీ(సీసీఎంబీ) కరోనా పోరులో ఒక అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా నుంచి వచ్చిన వైరస్​ నమూనాలను పరీక్షిస్తుంది. పలు వైద్య కళాశాలలకు చెందిన సిబ్బందికి కరోనా పరీక్షల్లో శిక్షణ ఇచ్చింది.

Center for Cellular and Molecular Biology  is a versatile war on the virus
వైరస్‌పై సీసీఎంబీ బహుముఖ యుద్ధం
author img

By

Published : Apr 13, 2020, 9:58 AM IST

సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ).. కరోనా వైరస్‌పై బహుముఖ యుద్ధం ప్రకటించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడం, అందులో మానవ వనరులకు శిక్షణ ఇవ్వడం, వైరస్‌ జన్యుపరిణామక్రమాన్ని కనిపెట్టడానికి కసరత్తుతోపాటు వైరస్‌ కల్చర్‌పైనా పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని సీసీఎంబీ కేంద్రం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన నమూనాలను పరీక్షిస్తోంది. ఇక్కడ రోజూ 350 పరీక్షలు జరుగుతున్నాయి.

వైరస్ పరీక్షపై శిక్షణ

పరీక్షలు నిర్వహించడంలో నిమ్స్‌, ఐపీఎం, హైదరాబాద్‌ ఫీవర్‌ ఆసుపత్రి, వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలకు చెందిన 25 మంది వైద్యులు, టెక్నికల్‌ సిబ్బంది, విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వీరంతా తమ ఆసుపత్రుల్లో నమూనాలను పరీక్షించగలుగుతున్నారు. ఆర్‌టీ-పీసీఆర్‌లో రోగి నమూనాలను ఎలా పరీక్షించాలో చెబుతూ వీడియో పాఠాలనూ సీసీఎంబీ అందిస్తోంది. కరోనా జన్యు పరిణామక్రమాన్ని గుర్తించడానికీ ముందడుగు వేసింది. ఈ వైరస్‌కు సంబంధించిన మొత్తం జన్యుపరిణామక్రమ పటాన్ని రూపొందించడానికి భవిష్యత్‌ తరం పరిణామక్రమంపై విశ్లేషణ మొదలుపెట్టింది. ఇందుకోసం వైరస్‌ ప్రభావం అత్యధికంగా ఉన్న రోగుల నమూనాలను సీసీఎంబీ సేకరించింది. ఇప్పటికే ఈ సంస్థ కొంతమంది రోగుల నుంచి సేకరించిన వైరస్‌ను ఐసోలేట్‌ చేసింది. వచ్చే మూడు నాలుగు వారాల్లో పరిణామక్రమాన్ని గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వైరస్‌ కల్చర్‌పైనా..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాలను కొత్త వైద్య అవసరాల కోసం పరీక్షించడానికి వైరస్‌ కల్చర్‌ అందుబాటులో లేకపోవడం పరిశోధకులకు ఇబ్బందికరంగా మారిన విషయాన్ని సీసీఎంబీ గుర్తించింది. అందుకే సీఎస్‌ఐఆర్‌-సీసీఎంబీలు వైరస్‌ కల్చర్‌పై పరిశోధనలకు ఒక వ్యవస్థను ఏర్పాటుచేశాయి. ఇందులో వైరస్‌లను వృద్ధిచేసి వాటి కల్చర్‌ను పరీక్షిస్తారు. త్వరలో ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

ఇదీ చూడండి: పాన్​ మసాలానే కాదు.. పొగాకు ఉత్పత్తినే నిషేధించాలి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.