మధ్యప్రదేశ్ ఝబువా జిల్లా దేవీగఢ్ గ్రామంలో ఓ వివాహితను ఊరి పెద్దలు అందరి ముందు అవమానించారు. వేరే కులానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణే ఇందుకు కారణం. తప్పు చేసినందుకు శిక్షగా ఆమె తన భర్తను మోయాల్సిందిగా బలవంతం చేశారు. చేసేది లేక ఆ యువతి శిక్షకు అంగీకరించింది. భర్తను భుజాలపై కొద్ది దూరం మోసింది.
ఈ అమానుష ఘటనను అందరూ ప్రత్యక్షంగా తిలకించారే తప్ప.. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. కొందరు ఈలలూ.. డ్యాన్సులు వేస్తూ ఆనందించారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.