ETV Bharat / bharat

'నవ భారత్​ బడ్జెట్'​లో ముఖ్యాంశాలివే...

మోదీ 2.0 ప్రభుత్వ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అనేక సవాళ్లు, అంచనాల మధ్య వచ్చిన ఈ బడ్జెట్​లో కొన్ని ప్రధానాంశాలు మీకోసం...

author img

By

Published : Jul 5, 2019, 7:31 PM IST

ఆశల పద్దు 2019లో ఏమున్నాయంటే..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్​సభలో 2019-20 పూర్తికాల బడ్జెట్ ప్రవేశపెట్టారు. సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు బడ్జెట్​పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీటితో పాటు అనేక సవాళ్ల మధ్య ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్​లో ముఖ్యమైన అంశాలు సంక్షిప్తంగా..

  1. 2014లో 1.85 ట్రిలియన్​ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను.. ఏన్డీఏ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 2.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్​. వచ్చే ఐదేళ్లలో 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
  2. దేశంలో ప్రస్తుతం 657 కిలో మీటర్ల మేర మెట్రో రైలు మార్గం ఉంది. మరో 300 కిలోమీటర్లకు అనుమతులు మంజూరయ్యాయని వెల్లడి.
  3. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిలో ఎలాంటి మార్పుల్లేవు. రూ.5 లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదు. పెట్టుబడుల సేకరణపై ఎలాంటి ఆదాయ పన్ను పరిశీలన ఉండదు.
  4. సూక్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. కోటి వరకు రుణ సదుపాయం.
  5. రూ.1.5 కోట్ల లోపు ఆదాయం ఉన్న చిల్లర వర్తకులకు...'కర్మ యోగి మాన్​ధన్ యోజన' పేరుతో పింఛను పథకం. దేశ వ్యాప్తంగా 3 కోట్ల దుకాణదార్లకు లబ్ధి చేకూరేలా పథకం రూపకల్పన.
  6. ఏడాదికి రూ. కోటికి మించి బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ చేసుకుంటే... 2 శాతం టీడీఎస్ వర్తింపు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహం కోసం ఎండీఆర్​(మర్చండైజ్​ డిస్కౌంట్ రేట్​) పూర్తిగా రద్దు.
  7. పెట్రోల్, డీజిల్ పై ఒక రూపాయి ఎక్సయిజ్ సుంకం పెంపు. బంగారంపై కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంపు.
  8. మధ్యంతర బడ్జెట్​లో ప్రతిపాదించిన పెట్టుబడుల ఉపసంహరణ రూ. 90,000 కోట్ల నుంచి రూ. 1,05,000 కోట్లకు పెంపు.
  9. రూ. 45లక్షల లోపు గృహ రుణాలపై ప్రస్తుతం రూ. 2 లక్షలుగా ఉన్న వడ్డీ రాయితీ.. రూ.3.5 లక్షలకు పెంపు. విద్యుత్ వాహనాలపై రూ. 1.5 లక్షల వడ్డీ రాయితీ.
  10. కొత్తగా రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేలు... చూపులేని వారు కూడా గుర్తించే విధంగా ముద్రణ... త్వరలో అందుబాటులోకి.
  11. మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ పథకం దేశవ్యాప్తంగా వర్తింపు. ముద్రా యోజన ద్వారా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకు రూ. లక్ష వరకు రుణం.
  12. 'భారత్ నెట్​' పథకంతో గ్రామీణ ప్రాంతాలకు అంతర్జాల సదుపాయాలను వేంగంగా విస్తరించే పనులు. గ్రామాలకు పట్టణాలకు మధ్య సాంకేతిక అంతరాలను తొలగించడమే ముఖ్య ఉద్దేశం.
  13. బ్యాంకులకు రుణాల కేటాయింపునకు మూలధన సహాయం కింద రూ.70,000 కోట్లు కేటాయింపు. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను మొండిబాకీల నుంచి గట్టెక్కించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడి.
  14. రూ. 400 కోట్లతో నూతన జాతీయ విద్యా విధానం. భారత్​ను విద్యా హబ్​గా మార్చి విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు 'స్టడీ ఇన్​ ఇండియా' కార్యక్రమానికి శ్రీకారం.

ఇదీ చూడండి: పద్దు 2019: నవభారత నిర్మాణం- సుస్థిర ప్రగతి

Intro:Body:

l

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.