ETV Bharat / bharat

భద్రతా బలగాల కాల్పుల్లో పాకిస్థానీ హతం - BSF latest news

భారత్​లోకి అక్రమంగా చొరబాటుకు ప్రయత్నించిన పాక్​కు చెందిన ఓ వ్యక్తిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తమైంది.

BSF kills Pak intruder along IB in Barmer
భద్రత బలగాల కాల్పుల్లో పాకిస్థానీ హతం
author img

By

Published : Aug 8, 2020, 6:05 PM IST

రాజస్థాన్​లోని సరిహద్దు జిల్లా బాడ్మేర్​ వద్ద దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన పాకిస్థాన్​కు చెందిన ఓ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళాలు(బీఎస్​ఎఫ్​) మట్టుబెట్టాయి. శుక్రవారం రాత్రి గుజరాత్​-రాజస్థాన్​ అంతర్జాతీయ సరిహద్దులో కంచెను దాటి.. భారత భూభాగంలోకి రహస్యంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు దుండగుడు. ఇది గమనించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి.

'పగటిపూట పాక్​ ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పడు బీఎస్ఎఫ్​ విఫలమైంది. అయితే, ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో చొరబాటుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం దృష్ట్యా బీఎస్ఎఫ్​ అప్రమత్తమైంది.' అని సైన్యాధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్రీయ స్వచ్ఛ్​ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.