ETV Bharat / bharat

'విస్తరణవాద శకం ముగిసింది- ఇది అభివృద్ధి యుగం' - 'విస్తరణవాద శకం ముగిసింది- ఇది అభివృద్ధి దశ'

లద్దాఖ్​లో ఆకస్మిక పర్యటన చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చైనాపై పరోక్ష విమర్శలు చేశారు. చరిత్రలో విస్తరణవాద శక్తులు ఓడిపోవడమో.. తోకముడవడమో జరిగిందన్నారు. సరిహద్దులో సైన్యం ప్రదర్శిస్తున్న శౌర్యపరాక్రమాలను కొనియాడారు. సైనికుల ధైర్యం నుంచే ఆత్మనిర్భర భారత్​ సంకల్పం బలపడుతుందన్నారు.

Bravery shown by you has sent message about India's strength: PM Modi to soldiers in Ladakh
'విస్తరణవాద శకం ముగిసింది- ఇది అభివృద్ధి దశ'
author img

By

Published : Jul 3, 2020, 4:37 PM IST

విస్తరణవాద శకం ముగిసిందని, ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లద్దాఖ్​లో పర్యటించిన మోదీ.. నిమూలో సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

"విస్తరణవాద శకం ముగిసింది. ఇది అభివృద్ధి యుగం. సామ్రాజ్యవాద శక్తులు ఓడిపోయాయనో, వెనక్కి తగ్గాయనో చెప్పడానికి చరిత్రే సాక్ష్యం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ గురించి మాట్లాడిన ప్రధాని మోదీ.. 14 కార్ప్స్​ ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశంలోని ప్రతి ఇంట్లో ప్రతిధ్వనిస్తాయన్నారు. ఈ సందర్భంగా సైనికులు ప్రదర్శిస్తున్న శౌర్యపరాక్రమాలను కొనియాడారు. గల్వాన్ ​లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన 20 మంది వీర జవాన్లకు సంతాపం ప్రకటించారు.

"దేశంలోని ప్రతి పౌరుడు మీ ధైర్యాన్ని చూసి గర్వపడుతున్నారు. నేనే కాదు దేశం మొత్తం మిమ్మల్ని విశ్వసిస్తోంది. 14 కార్ప్స్​ ప్రదర్శించిన శౌర్యం గురించి ప్రతి చోటా మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఇంట్లో మీ ధైర్యసాహసాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మీరు చూపించిన ధైర్యం ద్వారా భారతదేశ​ సామర్థ్యం గురించి ప్రపంచానికి సందేశం వెళ్లింది. ఇప్పుడు మీరున్న ప్రదేశం కంటే మీ ధైర్యం ఉన్నతమైనది. మీ త్యాగం, ధైర్యం నుంచే ఆత్మనిర్భర్​ భారత్​ సంకల్పం బలపడుతుంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

లద్దాఖ్​లో వేర్పాటువాదం సృష్టించాలనుకున్న వారి ప్రయత్నాలన్నింటినీ ఆ ప్రాంత​ పౌరులు తిరస్కరించారని మోదీ పేర్కొన్నారు. లద్దాఖ్ దేశానికే గౌరవ చిహ్నమని కీర్తించారు.

"లద్దాఖ్​ మన దేశానికి శిరస్సు వంటింది. 130 కోట్ల భారతీయుల గౌరవ చిహ్నం. దేశం కోసం ప్రాణ త్యాగం చేయాలనుకుంటున్న వారందరికీ ఈ భూభాగం సొంతం. ఈ ప్రాంతంలో వేర్పాటువాదం సృష్టించాలనుకున్న ప్రతి ప్రయత్నాన్ని లద్దాఖ్​ జాతీయవాద ప్రజలు తిరస్కరించారు."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ దేశంలో వేణువు వాయించే కృష్ణుడితో పాటు సుదర్శన చక్రంతో పోరాడే శ్రీకృష్ణుడిని సైతం భారత ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారని పేర్కొన్నారు మోదీ. అయితే ప్రధాని తన ప్రసంగంలో చైనా పేరును ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా హెచ్చరికలు పంపారు.

ఆకస్మిక పర్యటన

లద్దాఖ్​లో ఇవాళ ఆకస్మిక పర్యటన చేపట్టారు ప్రధాని. సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సైనికాధికారులతో చర్చించారు. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణే సైతం ప్రధాని పర్యటనలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి- 'వీరత్వంతోనే శాంతి- మన శక్తి, సామర్థ్యాలు అమేయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.