రక్షణ రంగంలో భారత్ మరో మైలు రాయిని దాటింది. భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కోల్‌కతా శ్రేణి డెస్ట్రాయర్ ‘ఐఎన్‌ఎస్ చెన్నై’ యుద్ధ నౌక నుంచి ఆదివారం విజయవంతంగా పరీక్షించారు. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది.
బ్రహ్మోస్ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సులువుగా ఛేదించగలవు.
క్షిపణి పరీక్ష విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్‌డీఓ అధికారులను అభినందించారు.
ఇదీ చూడండి:'దేశంలో కరోనా 2.0 రాదని చెప్పలేం'