వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్సభలో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య బంగాల్ వివాదంపై వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే దురుద్దేశంతో కేంద్రప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. విపక్షాల విమర్శలను హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తిప్పికొట్టారు.
ఇరు వర్గాల మధ్య 30 నిమిషాల పాటు వాడీవేడిగా చర్చ జరుగుతుండగానే సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. ఈ గందరగోళం మధ్య లోక్సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.
మధ్యాహ్నం ఉభయసభలు తిరిగి ప్రారంభమైన తర్వాత అవే పరిస్థితులు కొనసాగాయి. ఫలితంగా లోక్సభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి.