రెండు వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో గందరగోళం సృష్టించిన ప్రతిపక్ష పార్టీల సభ్యులపై ప్రివిలేజ్ మోషన్ (ప్రత్యేక హక్కుల తీర్మానం) తీసుకురావాలని భాజపా యోచిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా పార్లమెంటరీ సమావేశాలు మరింత వాడివేడిగా జరగనున్నాయి.
రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదించిన తీరును తప్పుబడుతూ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై 12 విపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాయి.
వ్యవసాయ బిల్లులపై చర్చ సమయంలో.. విపక్షాల గందరగోళం చేయడంపై విచారణ చేపట్టారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. ఈ తరుణంలో రాజ్యసభ ప్రతిపక్షనేత సహా నలుగురు సభ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం