మహారాష్ట్ర భివండీలోని మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 41కి చేరింది. ఈ విషయాన్ని జాతీయ విపత్తు నిర్వహణ బృందం(ఎన్డీఆర్ఎఫ్) ధ్రువీకరించింది.
ఇప్పటివరకు మొత్తం 25 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు.
సోమవారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో భివండీ పట్టణంలో శిథిలావస్థకు చేరిన పాత భవనం ఒకటి కూలిపోయింది. ఇది 43 ఏళ్లనాటిదని తెలుస్తోంది. భవనం యజమానిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు స్థానిక అధికారుల్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.