ETV Bharat / bharat

క్వారంటైన్​లో ఆకలితో గడిపి.. కరోనాపై గెలిచి... - corona patient experience in telugu

మానసిక దృఢత్వంతో కరోనాను జయించాడు బెంగళూరువాసి. కరోనా సోకినప్పుడు ఆయనలోని ఆందోళన, ఇంట్లోవారికి సోకకుండా తీసుకున్న జాగ్రత్తలు, నిర్బంధ కేంద్రంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాక పొందిన అనుభూతులన్నీ ఈటీవీ భారత్​తో పంచుకున్నారిలా...

bengaluru man recovered from corona virus Venkat Raghav shared his experience
క్వారంటైన్​లో ఆకలితో గడిపి.. కరోనాపై గెలిచి...
author img

By

Published : Mar 31, 2020, 4:53 PM IST

మందుమాకూ లేని కరోనా మహమ్మారి సోకితే కోలుకోవడమనేది అదృష్టం మాత్రమే అంటారు. కానీ, గుండె నిబ్బరం, మనోధైర్యం ఉంటే కరోనాను సులభంగా జయించొచ్చు అంటారు బెంగళూరుకు చెందిన ఓ 'కరోనాజయుడు'.

అక్కడే సోకిందేమో...

బెంగళూరులో నమోదైన నాలుగో కేసు బాధితుడు ఆయన. అమెరికా నుంచి కర్ణాటకకు వచ్చిన ఆయన ఇంగ్లాండ్​, హీత్రో విమానాశ్రయంలో కరోనా సోకి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇటలీ, చైనా ప్రయాణికులు ఎంతో మంది అక్కడ రాకపోకలు జరుపుతుంటారు. కాబట్టి ఎయిర్​పోర్ట్​లోని టాయ్​లెట్​ లేదా సెక్యూరిటీ చెకింగ్​ సమయంలో వైరస్​ వ్యాపించి ఉండవచ్చన్నారు.

కర్ణాటక రాజీవ్​ గాంధీ ఆసుపత్రి నుంచి కరోనాను జయించి డిశ్చార్జ్​ అయిన మొదటి వ్యక్తి ఆయన. కరోనా సోకినప్పటి నుంచి వైరస్​ నుంచి కోలుకునేవరకు తాను ఎదుర్కొన్న అనుభవాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

"నేను భారత్​కు చేరుకునే సమయానికి నాలో కరోనా లక్షణాలు కనిపించాయి. ఇంట్లో వారికి, ఇతరులకు వైరస్​ వ్యాపించకుండా చూడాలని నాకు తెలుసు. అందుకే నేను మా డూప్లెక్స్​ ఇంటి మొదటి అంతస్తులోనే ఉన్నాను. నా బంధువులు, స్నేహితుల సాయంతో నేను రాజీవ్​గాంధీ ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ నన్ను నిర్బంధ వార్డులో ఉంచారు. వైద్యులు యాంటీబయాటిక్స్​, టామీఫ్లూ వంటి మందులిస్తూ నాపట్ల జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని సార్లు నాకు హోటల్​ నుంచి తెప్పించిన భోజనం వడ్డించారు. మరికొన్ని సార్లు మా ఆఫీసు నుంచి పట్టుకొచ్చేవారు. డాక్టర్​ రజినీ మనోధైర్యాన్నిచ్చారు. నన్ను వారు వీలైనంత ప్రశాంతంగా ఉండమన్నారు. అది నిజంగానే సత్ఫలితాలిచ్చింది."

-కరోనాజయుడు

ఆకలితోనే....

బాధితుడి ఆఫీసు నుంచి ఆసుపత్రికి భోజనం తీసుకొచ్చే యువకులు తమకు కరోనా సోకుతుందేమోనని భయపడేవారు. వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, చాలా సార్లు తనకు ఆకలిగా లేదని చెప్పి అలాగే పస్తు ఉండిపోయినట్లు తెలిపారు ఆ కరోనానుజయుడు.

ఇదీ చదవండి:మందు బాబులకు లిక్కర్ పాసులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.