కొద్దిరోజులుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా మహమ్మారి విషయంలో మరింత జాగ్రత్త అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చెప్పుల ద్వారా కూడా కొవిడ్-19 సోకే ప్రమాదముందని కర్ణాటక పరిశోధకులు చేసిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
శానిటైజేషన్ తప్పనిసరి..
కరోనా రోగులు తిరిగిన ప్రదేశాల్లో నడవడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉమ్మి ద్వారా మహమ్మారి వేగంగా సంక్రమిస్తుందని తెలిపారు. ఇందుకోసం బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా చెప్పులను ధరించాలన్న వైద్యులు.. రోడ్లపై నడిచేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇంటికి రాగానే చెప్పులను శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
పాదరక్షలు శానిటైజ్ చేసుకునేందుకు బెంగళూరు 'ట్రస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్' ఇప్పటికే ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది. రసాయనాలు కలిసిన నీటిలో చెప్పులు ఉంచితే... వాటిపై ఉన్న క్రిములు చనిపోతాయని చెప్పారు ట్రస్ట్ ప్రతినిధి శ్రీధర్.
కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా బహిరంగ ప్రదేశాలలో పాన్, గూట్కాలు ఉమ్మి వేయడంపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం.
ఇదీ చదవండి: భారత్లో యాక్టివ్ కేసుల కంటే రికవరీనే ఎక్కువ