అయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరగనుంది. భూమిపూజ కార్యక్రమం, అయోధ్యలో మోదీ పర్యటన ఎలా సాగుతుందో తెలిపే వివరాలు సంక్షిప్తంగా..
శంకుస్థాపన మహోత్సవం జరగనుంది ఇలా...
11:30:- ప్రధాని మోదీ అయోధ్య చేరుకుంటారు. ఆ వెంటనే హనుమాన్‌గఢీ ఆలయానికి వెళతారు. 5-7 నిమిషాల పాటు అక్కడే ఉంటారు.
12:00:- రామ జన్మభూమి ప్రాంగణానికి మోదీ చేరుకుంటారు. అప్పటికే పండితులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి.
12:30:- మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు భూమి పూజ కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ.
ప్రధాని అయోధ్య పర్యటన సాగనుందిలా..
- ఉదయం 9:30 గంటలకు దిల్లీ నుంచి అయోధ్య బయలుదేరుతారు.
- 10:35 లఖ్‌నవూ విమానాశ్రయంలో దిగుతారు.
- 10:40 విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో అయోధ్యకు పయనమవుతారు.
- 11:30 అయోధ్యలోని సాకేత్ కాలనీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగుతారు.
- 11:40 హనుమాన్ గఢీని దర్శించుకుంటారు.
- 12:00 రామజన్మభూమి చేరుకుంటారు. 10 నిమిషాల పాటు రామ్‌లల్లాను దర్శించుకుంటారు
- 12:15 రామమందిర ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.
- 12:30 భూమిపూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
- 12:40 రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
- 1:10 స్వామి నృత్యగోపాల్ దాస్ సహా రామమందిర తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులతో భేటీ అవుతారు.
- 2:05 సాకెత్ కాలనీలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
- 2:15 లఖ్‌నవూకు తిరుగుపయనమవుతారు.
అయోధ్య రామమందిర శంకుస్థాపన, ప్రధాని రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఇదీ చూడండి: రామ్‌లల్లా వస్త్రాలంకణ బాధ్యత లాల్ కుటుంబానిదే!