ETV Bharat / bharat

ఉమామహేశ్వర ఉగ్ర 'హాథ్రస్య'

అందరిముందు తనను చితకబాదిన విలన్​ను తిరిగి కొట్టేవరకు చెప్పులు తొడుక్కోనని శపథం చేస్తాడు 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాలో హీరో. ఇదే తరహాలో.. హాథ్రస్ ఘటన నిందితులను శిక్షించే వరకు తానూ జోళ్లు వేసుకోనని హరియాణాలో ఓ వ్యక్తి ప్రతినబూనాడు.

Auto driver Rajpal Bumra
ఆటోడ్రైవర్​ రాజ్​పాల్​ బుమ్రా
author img

By

Published : Oct 5, 2020, 3:58 PM IST

హరియాణా హిసార్ జిల్లా ఆర్యానగర్​కు చెందిన ఓ ఆటోడ్రైవర్.. హాథ్రస్​ ఘటన నిందితులకు శిక్ష పడేంతవరకు తాను చెప్పులేసుకోనని శపథం చేశాడు.

"దేశంలో పుట్టినప్పటినుంచే మహిళలకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఎన్నో హత్యా ఘటనల్లో మహిళలకు న్యాయం జరగట్లేదు" అని వాపోయాడు రాజ్​పాల్​ బుమ్రా.

Auto-driver vows not to wear slippers till Hathras rape culprits punished
ఆటోడ్రైవర్​ రాజ్​పాల్​ బుమ్రా

నిర్భయ ఘటనలో అలా..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన నిందితులకు శిక్ష పడిన రోజు రాజ్​పాల్​ వార్తల్లోకెక్కాడు. ఆ రోజంతా మహిళలకు ఉచితంగా ఆటో సేవలందించాడు. ఏటా రాఖీ పౌర్ణమి సందర్భంగానూ ఇలాంటి సౌకర్యమే కల్పిస్తుంటాడు రాజ్​పాల్.

ఇదీ చదవండి: ఆ వృద్ధురాలికి వీధి కుక్కలే ప్రపంచం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.