ETV Bharat / bharat

'నెహ్రూ తప్పుడు నిర్ణయంతోనే పీఓకే ఏర్పాటు' - పాక్​ ఆక్రమిత్​ కశ్మీర్​

పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 1947లో భారత బలగాలను అప్పటి ప్రధానమంత్రి జవహర్​లాల్​ నెహ్రూ ఆపి ఉండకపోతే ఇప్పుడు పీఓకే ఉండేదే కాదని అన్నారు. నెహ్రూ తప్పుడు నిర్ణయంతోనే పీఓకే ఏర్పడిందని ముంబయిలో ఆరోపించారు షా.

'నెహ్రూ తప్పుడు నిర్ణయంతోనే పీఓకే ఏర్పాటు'
author img

By

Published : Sep 22, 2019, 3:14 PM IST

Updated : Oct 1, 2019, 2:10 PM IST

భారత తొలి ప్రధాన మంత్రి జవహర్​లాల్​ నెహ్రూపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేంద్ర హోంమంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కశ్మీర్​లో భారత బలగాలు ఉన్నప్పుడు అకాలంగా కాల్పులు విరమించాలని నెహ్రూ ఆదేశాలివ్వకపోతే... పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)​ ఉండేదే కాదన్నారు షా. నెహ్రూ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల నేటికీ ఆ సమస్యతో ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు.

అక్టోబర్​లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ముంబయిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా

" 1947 అక్టోబర్​ 26న మహారాజా హరీష్​ సింగ్​ కశ్మీర్​ను భారత్​లో విలీనం చేసేందుకు అంగీకరించారు. అక్టోబర్​ 27న భారత బలగాలు కశ్మీర్​కు వెళ్లాయి. సైన్యం పాక్​ వైపు వెళుతూనే ఉంది. పాకిస్థాన్​ దళాలను తరిమి కొడుతూ మన బలగాలు చొచ్చుకెళ్లాయి. ఆ సమయంలో భారత ప్రధానమంత్రి జవహర్​లాల్​ నెహ్రూ యుద్ధానికి విరామం ప్రకటించారు. ఆ సమయంలో యుద్ధ విరామం ప్రకటించకుంటే పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​ ఉండేదే కాదు. యుద్ధాన్ని నిలిపేయటం వల్ల పీఓకే ఏర్పడింది. నెహ్రూ​ తప్పుడు నిర్ణయంతో పీఓకేగా మారింది."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

కాంగ్రెస్​పై విమర్శలు...

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దును కాంగ్రెస్​ రాజకీయం చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు షా. కానీ తాము అలా చేయలేదని ఉద్ఘాటించారు. ఎలాంటి హింసకు తావులేకుండా పరిస్థితిని అదుపులో ఉంచినట్లు వివరించారు. రానున్న రోజుల్లో అవిశ్రాంతంగా కశ్మీర్​ను అభివృద్ధి చేసి, తీవ్రవాదాన్ని అంతమొందిస్తామని స్పష్టంచేశారు అమిత్​ షా.
అధికరణ 370 రద్దుకు మద్దతిస్తున్నారో లేక వ్యతిరేకిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ను డిమాండ్ చేశారు షా.

ఇదీ చూడండి: 'హౌడీ మోదీ'తో ఇద్దరికీ లాభమేనా? ఏం జరుగుతుంది?

AP Video Delivery Log - 0400 GMT News
Sunday, 22 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0307: Syria IS Family AP Clients Only 4231134
Wife of IS fighter back in Raqqa after 2yrs on the run
AP-APTN-0258: Venezuela March AP Clients Only 4231132
Pro-Maduro march protesting US economic blockade
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.