ETV Bharat / bharat

బిహార్​ తర్వాతి సీఎం ఆయనే: అమిత్​షా - bihar polls 2020 news

బిహార్​లో ఎన్నికల హడావిడి మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో ప్రచారాస్త్రాలతో జోరు మీదుంది భాజపా. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన భాజపా సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. సీఎం అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు.

next CM of Bihar in 2020
బిహార్​ తర్వాతి సీఎం ఆయనే..: అమిత్​షా
author img

By

Published : Oct 18, 2020, 7:33 AM IST

బిహార్​లో జేడీయూ-భాజపా కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు భాజపా సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. శనివారం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.

బిహార్​ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ-భాజపా మళ్లీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈసారి కాషాయం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే సీఎం పదవిలో భాజపా అభ్యర్థి ఉంటారా అనే ప్రశ్నకు షా సమాధానమిచ్చారు. రానున్న ఎన్నికల్లో గెలిస్తే నితీశ్​ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు. ఎన్​డీఏ రెండొంతుల మెజార్టీ సాధిస్తుందని జోస్యం చెప్పారు.

"ఎలాంటి అనుమానాలకు తావులేదు. బిహార్​ తర్వాతి సీఎం నితీశ్​ కుమారే. ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశాం. దానికి మేం కట్టుబడి ఉన్నాం"

-- అమిత్​షా, భాజపా సీనియర్​ నేత

బిహార్​ ప్రజలకు ఈ ఎన్నికలు ఓ వరంగా పేర్కొన్నారు అమిత్​ షా. రాష్ట్రంలో నితీశ్​ కుమార్​ ప్రభుత్వం.. కేంద్రంలో మోదీ ప్రభుత్వంతో 'డబుల్​ ఇంజిన్​' ప్రభుత్వాలతో మేలు చేకూరుతుందని భరోసానిచ్చారు. లోక్​జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) తమ కూటమి నుంచి తప్పుకోవడంపైనా షా స్పందించారు. తగినన్ని సీట్లు ఆ పార్టీకి కేటాయించినా.. కూటమి నుంచి వైదొలిగిందని పేర్కొన్నారు. కూటమి నుంచి తప్పుకోవడం చిరాగ్​ పాసవాన్​ సొంత నిర్ణయమని.. అందులో తమ పాత్రలేదని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.