ETV Bharat / bharat

'భాజపా వ్యతిరేకులు దేశద్రోహులు కారు'

భాజపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అగ్రనేత అడ్వాణీ తన బ్లాగులో వెల్లడించిన మనోగతం తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ ప్రత్యర్థులు, ప్రజాస్వామ్య వ్యవస్థలు సహా గాంధీనగర్​ ప్రజల గురించి ఆయన ప్రస్తావించారు.

భాజపాకు శత్రువులు లేరు, ప్రత్యర్థులే: అడ్వాణీ
author img

By

Published : Apr 4, 2019, 9:34 PM IST

Updated : Apr 5, 2019, 7:25 AM IST

'భాజపా వ్యతిరేకులు దేశద్రోహులు కారు'

"రాజకీయంగా విభేదించే వారిని భాజపా ప్రత్యర్థులుగా చూసిందే తప్ప ఎప్పుడూ శత్రువులుగా, జాతి వ్యతిరేకులుగా చూడలేదు".... భాజపా అగ్రనేత లాల్​ కృష్ణ అడ్వాణీ బ్లాగు ద్వారా వెల్లడించిన మనోగతం ఇది.

పుల్వామా దాడి, బాలాకోట్​ వైమానిక దాడి వంటి విషయాల్లో రాజకీయంగా విభేదించిన ప్రతిపక్ష నేతలను జాతి వ్యతిరేకులుగా, శత్రువులుగా అభివర్ణిస్తూ కొందరు భాజపా నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో... అడ్వాణీ వ్యాఖ్యలు అందరినీ ఆలోచనలో పడేశాయి.

"నేషన్‌ ఫస్ట్‌, పార్టీ నెక్స్ట్‌, సెల్ఫ్‌ లాస్ట్‌" పేరిట సొంత బ్లాగ్‌లో ఐదేళ్ల తర్వాత అభిప్రాయాలు పంచుకున్నారు అడ్వాణీ.

" పార్టీలోని వారందరూ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన ముఖ్యమైన సందర్భమిది. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా నా ఆలోచనలను దేశ ప్రజలు, పార్టీ శ్రేణులతో పంచుకోవటం నా బాధ్యత. వాక్‌ స్వాతంత్ర్యం, భిన్నత్వాన్ని గౌరవించటం.. దేశ ప్రజాస్వామ్య గొప్ప లక్షణం. రాజకీయంగా విభేదించే వారిని భాజపా ప్రత్యర్థులుగానే పరిగణిస్తుందే తప్ప శత్రువులుగా, జాతి వ్యతిరేకులుగా చూడలేదు. "
-- అడ్వాణీ, భాజపా అగ్రనేత

ఆత్మ విమర్శ చేసుకోవాలి

" ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను గెలిపించాలి. భారత ప్రజాస్వామ్యంలో భాగస్వాములైన రాజకీయ పార్టీలు, మీడియా, అధికార యంత్రాంగం, ఓటర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీలకు అందే నిధులు, ఎన్నికల ఖర్చు పారదర్శకంగా ఉంటేనే అవినీతి రహిత రాజకీయాలు ఉంటాయన్నది భాజపా విశ్వాసం."
-- అడ్వాణీ, భాజపా అగ్రనేత

దేశం ప్రథమం.. ఆ తర్వాతే అన్నీ

దేశ ప్రయోజనాలే ప్రతి ఒక్కరి ప్రథమ ప్రాధాన్యం కావాలని ఆకాంక్షించారు అడ్వాణీ.

"వ్యక్తిగతంగా, రాజకీయంగా ప్రతి పౌరుడి స్వేచ్ఛకు భాజపా కట్టుబడి ఉంది. మొదట దేశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత పార్టీ. చివరిగా వ్యక్తిగత ప్రయోజనం చూసుకోవాలి. ఈ సిద్ధాంతానికి కట్టుబడే నేను పని చేశాను. ఇక ముందు ఇలానే ఉంటా."
-- అడ్వాణీ, భాజపా అగ్రనేత

ఉన్నత స్థితికి పోరాటాలే కారణం

భాజపా ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉండేందుకు కారణం గతంలో జరిగిన పోరాటాలేనని గుర్తు చేశారు అడ్వాణీ.

"రాజకీయ వ్యవస్థలోనూ, పార్టీలోనూ ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటమే భాజపాను ఉన్నత స్థితికి చేర్చింది. పార్టీలోపల, వెలుపల ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనేదే పార్టీ సిద్ధాంతం. ప్రజాస్వామ్యంలో వ్యవస్థల స్వేచ్ఛ, సమగ్రతను గౌరవించాలి. అవినీతి రహిత రాజకీయాలకు ఎన్నికల సంస్కరణలు... ముఖ్యంగా రాజకీయాలతోపాటు ఎన్నికల నిధుల్లో పారదర్శకత అవసరం. ఇది మా పార్టీ మరో ప్రాధాన్యం. సంక్షిప్తంగా చెప్పాలంటే... సత్యం, దేశం పట్ల నిబద్ధత, పార్టీ లోపల, బయట ప్రజాస్వామ్యం కోసం పార్టీ పోరాటం చేసింది. అవన్నీ కలిపితేనే సాంస్కృతిక జాతీయవాదం, సుపరిపాలన. అందుకు భాజపా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. అత్యయిక పరిస్థితికి వ్యతిరేకంగా చేసిన పోరాటం. ఆ విలువల కట్టుబాటుకు నిదర్శనం."
-- అడ్వాణీ, భాజపా అగ్రనేత

గాంధీ నగర్​ ప్రజలకు ధన్యవాదాలు

తనను ఇంత కాలం గెలిపించిన గాంధీనగర్​ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అడ్వాణీ.

1991 నుంచి ఆరుసార్లు అడ్వాణీ ప్రాతినిథ్యం వహించిన గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా బరిలో దిగారు.

Kullu (Himachal Pradesh), Apr 04 (ANI): One person died and around 40 were injured after a bus fell down from a cliff near Lag Valley in Kullu district of Himachal Pradesh. The injured were taken to nearby hospital for treatment.
Last Updated : Apr 5, 2019, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.