ETV Bharat / bharat

''సర్​' అనండి చాలు.. 'మై లార్డ్' అక్కర్లేదు!' - judge being called as sir

బంగాల్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ​ ఓ అరుదైన కోరిక కోరారు. ఏళ్లుగా ఇతర ప్రధాన న్యాయమూర్తులను సంబోధించినట్లు 'మై లార్డ్​' అని కాకుండా.. తనను 'సర్'​ అని పిలిస్తే చాలని కింది స్థాయి కోర్టులకు ఓ లేఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.

address-me-as-sir-and-not-my-lord-cal-hc-chief-justice-tells-judiciary-officers
''సర్​' అనండి చాలు.. 'మై లార్డ్'అక్కర్లేదు!'
author img

By

Published : Jul 16, 2020, 4:48 PM IST

న్యాయ విభాగంలో ప్రధాన న్యాయమూర్తులను గౌరవప్రదంగా 'మై లార్డ్'​ లేదా 'లార్డ్​షిప్​' అని సంబోధించడం సాధారణం. వారి అత్యున్న అధికారాన్ని ఉపయోగించి వారిచ్చే తీర్పును భగవంతుడి ఆజ్ఞగా భావిస్తామని చెప్పడానికి సంకేతంగా కోర్టులోని ఇతర అధికారులు ప్రధాన న్యాయమూర్తులను 'మై లార్డ్'​ అని సంబోధిస్తారు. ఇది దేశంలో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. అయితే, బంగాల్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రం ఈ పద్ధతిని మార్చేశారు. ఆయన్ను మై లార్డ్​గా కాక, 'సర్​' అని పిలిస్తే చాలంటున్నారు.

బంగాల్​, అండమాన్​-నికోబార్​ దీవుల న్యాయాధికారులు ఇకపై తనను 'సర్'​ అని పిలవాలని స్పష్టం చేశారు బంగాల్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ టీబీఎన్​ రాధాకృష్ణన్. 'మై లార్డ్'​ అని పిలవాల్సిన పని లేదని అన్ని జిల్లాల న్యాయమూర్తులు, ప్రధాన న్యామూ​ర్తులకు ఓ లేఖ ద్వారా తెలియజేశారు.

"ఇకపై గౌరవనీయ హైకోర్టు రిజిస్ట్రీ సహా జిల్లా న్యాయాధికారులు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తిని 'మై లార్డ్' లేదా 'లార్డ్ షిప్' కు బదులుగా 'సర్' అని సంబోధించాలి" అని ఆ లేఖలో పేర్కొన్నారు జస్టిస్​ రాధాకృష్ణన్​.

ఇదీ చదవండి: దొంగతనం చేసిన బాలుడికి జడ్జి సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.