ETV Bharat / bharat

కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స! - కరోనా విజృంభణ

మందూ మాకూ లేని కరోనా నుంచి​ తప్పించుకోవాలంటే వైరస్​ సోకిన వ్యక్తికి వీలైనంత దూరంగా ఉండడమే మార్గం. అందుకే, భౌతిక దూరం పాటించాలని సూచిస్తారు వైద్యులు. కానీ, ముంబయిలోని ఓ ఆసుపత్రి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ కరోనాతో చనిపోయినవారి మృతదేహాల నడుమ సాధారణ రోగులకు వైద్యం చేస్తున్నారు మరి!

a video shows bodies wrapped in plastic lying next to patients at Mumbai’s KEM Hospital
కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!
author img

By

Published : May 11, 2020, 3:32 PM IST

కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!

ఓవైపు మహారాష్ట్రలో కరోనా విజృంభణ చూసి యావత్​దేశం కలవర పడుతూంటే.. ఆ రాష్ట్రంలోని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలకు మాత్రం చీమ కుట్టినట్టైనా లేనట్టుంది. అందుకే వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు పాటించాల్సిన కనీస జాగ్రత్తలను తుంగలో తొక్కుతున్నాయి. వైద్యం కోరి వచ్చిన రోగుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ముంబయి కెమ్​(కింగ్ ఎడ్వర్డ్​ మెమోరియల్​) ఆసుపత్రి నిర్వాకం బయటపడింది. కరోనాతో మృతిచెందిన వారి శవాల మధ్యే ఇతర రోగులకు చికిత్స అందిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్​ అయ్యింది.

ఎటు చూసినా.. నిర్లక్ష్యమే

పరేల్​లోని కెమ్​ ఆసుపత్రిలో భౌతిక దూరం మచ్చుకైనా కనిపించట్లేదు. కనీస వసతులు లేక రోగులు నేలపై పడి ఉన్నారు. అంతే కాదు, 20(ఏ) వార్డులో కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని సాధారణ రోగుల మధ్యే నిర్లక్ష్యంగా వదిలేసిన దృశ్యాలు వైరల్​ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో కరోనా లేని వారికి సైతం వ్యాధి సోకే ప్రమాదం ఉంది.

కెమ్​ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందినవారి శవాలపై కప్పే బాడీ బ్యాగ్​లు ఎక్కడపడితే అక్కడ పడి ఉన్న ఓ వీడియోను భాజపా ఎమ్మెల్యే నితేశ్​ రాణే ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. ఆ వీడియోపై కెమ్​ యాజమాన్యం స్పందించలేదు.

అయితే, ఆ వీడియోలు ఎప్పటివో అయి ఉండొచ్చని.. ప్రస్తుతం ఆసుపత్రలు జాగ్రత్తలు తీసుకుంటున్నయని పేర్కొన్నారు శివసేన నేత అనిల్​ దేశాయ్.

​ఒక్క చోట కాదు..

కొద్ది రోజుల క్రితం ముంబయిలోని సియోన్​ ఆసుపత్రిలోనూ ఇలాంటి దృశ్యాలే వెలుగుచూశాయి. అయితే ప్రస్తుతం ఆ రెండు ఆసుపత్రులు ముంబయి నగరపాలక సంస్థ నిర్వహించడం గమనార్హం.

ఈ విషయమై ముంబయి ఆరోగ్య విభాగ అదనపు కమిషనర్ సురేశ్​ కకానీని సంప్రదించింది ఈటీవీ భారత్​. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు కమిషనర్​. అయితే, గతంలో సియోన్​ ఆసుపత్రి డీన్​పై చర్యలు తీసుకున్నట్లుగానే ​కెమ్​ ఆసుపత్రి డీన్​ డా. దేశ్​ముఖ్​పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మహారాష్ట్రలో ఇప్పటికే 22 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 832 మంది వైరస్​కు బలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి​ నిర్వాహకులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర దుమారం రేపుతోంది.

ఇదీ చదవండి:ఒక్కరి నిర్లక్ష్యం- కుటుంబంలో 10 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.