ETV Bharat / bharat

నాసిక్​-త్రివేండ్రం ప్రయాణానికి ఏడాది! - అంతరిక్ష పరిశోధన కేంద్రం

భారీ యంత్రంతో బయలు దేరిన ఓ ట్రక్కు మహారాష్ట్ర నుంచి కేరళ తిరువనంతపురానికి చేరుకుంది. మొత్తం నాలుగు రాష్ట్రాలను దాటుకుంటూ నగరానికి చేరుకోవటానికి ఏడాది సమయం పట్టినట్లు సంబంధిత సిబ్బంది తెలిపారు.

A truck, carrying an aerospace horizontal autoclave for delivery to Vikram Sarabhai Space Centre in Thiruvananthapuram
ఆ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్న ఆటోక్లేవ్​
author img

By

Published : Jul 19, 2020, 5:31 PM IST

మహారాష్ట్ర నుంచి కేరళకు చేరుకోవటానికి మహా అయితే రెండు రోజుల సమయం పడుతుంది. కానీ ఓ ట్రక్కుకు మాత్రం ఏడాది సమయం పట్టింది. ఏంటీ ఆశ్చర్య పోతున్నారా? అవునండి ఇది నిజమే! మహారాష్ట్ర నాసిక్​ నుంచి అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన అధునాతన యంత్రాలతో బయలు దేరిన ఓ టక్కు ఏడాది తర్వాత కేరళ తిరువనంతపురానికి చేరుకుంది. ఈ ఆటోక్లేవ్​ యంత్రాలను విక్రమ్​ సారాభాయ్​ అంతరిక్ష కేంద్రానికి తరలిస్తున్నట్లు సంబంధిత సిబ్బంది వెల్లడించారు.

A truck, carrying an aerospace horizontal autoclave for delivery to Vikram Sarabhai Space Centre in Thiruvananthapuram
అధునాతన యంత్రాలతో 'బాహుబలి' ట్రక్కు

32 చక్రాల బండిలో ఆటోక్లేవ్​

మహారాష్ట్రలో జులై 2019లో బయలుదేరిన మేము 4 రాష్ట్రాలను దాటుకుంటూ నగరానికి చేరుకున్నాము.

-ట్రక్కు సిబ్బంది.

రోజుకు ఐదు కిలోమీటర్ల ప్రయాణం

70 టన్నుల బరువు గల యంత్రం

మహారాష్ట్ర నుంచి బయలు దేరిన ట్రక్కు రోజుకు ఐదు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించేది. ఇలా ఏడాది పాటు నాలుగు రాష్ట్రాలను దాటుకుంటూ తిరువనంతపురానికి చేరుకున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఆటోక్లేవ్​ యంత్రం 70 టన్నుల బరువు ఉందని, ఎత్తు, వెడల్పు వరుసగా 7.5, 6.5 మీటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనల కోసం ఈ యంత్రాన్ని మహారాష్ట్ర నాసిక్​లో తయారు చేశారు. మొత్తం 32 మంది సిబ్బంది ఈ యంత్రాన్ని జాగ్రత్తగా కేరళకు తరలించారు.

ఇదీ చూడండి:రఫేల్​ మోహరింపుపై వాయుసేన ఉన్నతాధికారుల చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.