ఒడిశాలో మారుమూల గ్రామాలు ఇప్పటికీ మౌలిక వసతుల లేమితో సతమతమవుతున్నాయి. కనీస ప్రయాణ సౌకర్యాలు లేక నిత్యం వార్తల్లో నిలిచే ఒడిశా గ్రామాల్లో మరో గర్భిణి కష్టాలు పడింది. పురిటి నొప్పులతో మెడ లోతు నదిని దాటి ఆసుపత్రికి చేరింది.
కియోంజార్ జిల్లాలోని సపలంగి నుంచి వేరే గ్రామానికి వెళ్లాలంటే నదిని దాటాల్సిన పరిస్థితి. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క పడవ ఇటీవల వచ్చిన వరదల్లో కొట్టుకుపోయింది. సపలంగిలో నివాసం ఉంటున్న హాది ముంద భార్య చంద్రి గర్భిణి. ఈ రోజు పురిటి నొప్పులు ప్రారంభం కాగా ఆసుపత్రికి వెళ్లేందుకు దారి లేక సతమతమయ్యారు కుటుంబసభ్యులు.
ఆశా కార్యకర్త చొరవతో..
విషయం తెలుసుకున్న గ్రామంలోని ఆశా కార్యకర్త.. చంద్రిని ఎలాగైనా ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మరో ఇద్దరి సాయంతో మెడలోతు ప్రవాహాన్ని జాగ్రత్తగా దాటించి గర్భిణిని ఆసుపత్రికి చేర్చింది.
నిత్యం ఇవే ఘటనలు
ఇలాంటి ఘటనలు ఒడిశాలో నిత్యకృత్యం అవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో వైద్య సదుపాయాల కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇదీ చూడండి: భారత వాయుసేన స్థావరాలపై దాడులకు పాక్ కుట్ర!