ETV Bharat / bharat

మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు - దేశ వ్యాప్తంగా కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 368 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం 3600 మందికి పైగా వైరస్​ సోకింది. దిల్లీ, రాజస్థాన్​, తమిళనాడు, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో మహమ్మారి ప్రభావం మరింత తీవ్రంగా ఉంది.

328 new COVID19 cases have been recorded today in Maharashtra
మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు
author img

By

Published : Apr 18, 2020, 8:40 PM IST

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అత్యధిక కేసులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవగా, తర్వాతి స్థానంలో దిల్లీ నిలిచింది.

మహారాష్ట్రలో..

దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారింది మహారాష్ట్ర. పుణెకు చెందిన ఓ పోలీస్​ కానిస్టేబుల్​, అతని భార్యకు వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. అంతేకాకుండా ఓ సీనియర్ డాక్టర్​ కూడా మహమ్మారి బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 368 కొత్త కేసులు నమోదవగా.. ఒక్క ముంబయిలోనే 184 కొవిడ్​-19 కేసులను గుర్తించారు అధికారులు. వీటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 3,648 మందికి వైరస్​ సోకింది. మొత్తం 201 మంది మృతి చెందగా, 331 మంది కోలుకున్నారు.

దిల్లీలో..

దిల్లీలో తాజాగా మరో 67 మంది సోకినట్లు తెలిపారు. దీంతో వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 1707కు చేరింది. అయితే గత మూడు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ వెల్లడించారు.

తమిళనాడులో..

తమిళనాడులో ఇవాళ మరో 49 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 1,372కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి చెందారు.

గుజరాత్​లో..

గుజరాత్​లో ఇవాళ ఒక్కరోజే ఏడుగురు మృతి చెందగా, మొత్తం 48 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. అంతేకాకుండా మరో 176 మందికి వైరస్​ సోకింది. ఇప్పటివరకు మొత్తం 1376 మంది మహమ్మారి బారిన పడ్డారు.

ఉత్తరప్రదేశ్​లో..

కరోనా లక్షణాలతో 20 ఏళ్ల యువకుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి గత రెండు రోజుల నుంచి నిర్బంధ కేంద్రంలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. తాజాగా మరో 20 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 969కి చేరింది.

కర్ణాటకలో..

కర్ణాటకలో తాజాగా మరో 12 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఫలితంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 371కి చేరింది. మొత్తం 92 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..

జమ్ముకశ్మీర్​లో తాజాగా మరో 14 కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 341కి చేరింది. ఉత్తరాఖండ్​లో తాజాగా మరో 3 కేసులు బయటపడినందున.. మొత్తం కేసులు సంఖ్య 42కు చేరింది. హిమాచల్​ ప్రదేశ్​ లో మొత్తం 40 మందికి వైరస్​ సోకింది. కేరళలో మొత్తం కేసులు 396 కాగా.. ముగ్గురు మృతి చెందారు.

షా సమీక్ష..

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ పొడిగించిన నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. ఈ నేపథ్యంలో నిత్యావసరాల రవాణాపైనా చర్చ జరిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.