ETV Bharat / bharat

అమెరికాలో భారతీయ విద్యార్థులు ఇంతమంది ఉన్నారా? - అమెరికాలో అత్యధికంగా విదేశీ విద్యార్థులుండే తొలి ఐదు దేశాలు

అగ్రరాజ్యంలో భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 2017 కంటే 2018లో 1.68శాతం పెరిగిన ఈ సంఖ్య... అదే సమయంలో విదేశీ విద్యార్థుల సంఖ్య మాత్రం 1.7 శాతానికి తగ్గిపోయింది. తాజా సర్వే తెలిపిన వివరాల ప్రకారం... అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం 2017, 2018 సంవత్సరాలను పోలుస్తూ వెల్లడించిన ఈ సర్వేలో.. భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగినా వృద్ధిశాతం మాత్రం గణనీయంగా తగ్గిందని తేలింది.

Indian students in the US
అగ్రరాజ్యంలో భారతీయ విద్యార్థుల సంఖ్య
author img

By

Published : Feb 25, 2020, 12:27 PM IST

Updated : Mar 2, 2020, 12:30 PM IST

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. 2017 కంటే 2018 లో మన వారు 4,157 మంది పెరిగారు. అదే సమయంలో అగ్రరాజ్యంలో చదువు కోసం వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 26,120 తగ్గింది. చైనా విద్యార్థులు 147 మంది తగ్గారు. అంతర్జాతీయ విద్యార్థులపై అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం 2017, 2018 సంవత్సరాలను పోలుస్తూ తాజాగా ఈ నివేదిక విడుదల చేసింది. భారతీయ విద్యార్థుల సంఖ్య కొద్దిగా పెరిగినా వృద్ధి శాతం బాగా పడిపోయిందని కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికాలో చాలా మంది భారతీయ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత మూడేళ్ల ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) పూర్తయ్యే లోపు హెచ్‌1బీ వీసా రానందున రెండో పీజీ చదువుతున్నారు. దీంతో విద్యార్థి వీసాపై ఉన్న వారి సంఖ్యలో స్వల్ప పెరుగుదల ఉందని భావిస్తున్నారు. మూడు నాలుగేళ్లుగా భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌తోపాటు జర్మనీ, ఐర్లాండ్‌ తదితర దేశాలను ఎంచుకుంటున్నారని వారు చెబుతున్నారు.

ఇతర ముఖ్యాంశాలు

  • 232 దేశాల విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు.
  • వీరి సంఖ్య 2017లో: 15,51,373
  • 2018లో: 15,25,253
  • తగ్గుదల: 26,120 (1.70%)
  • ఆసియా ఖండం నుంచి తగ్గుదల: 22,598 (1.9%)
  • దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల నుంచి మాత్రమే అమెరికాకు విద్యార్థులు పెరిగారు.
  • కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా 3,02,073 మంది (19.50%) చదువుతున్నారు.
    Indian students in the US
    అమెరిరాలో ఉండే భారతీయ విద్యార్థుల సంఖ్య
    Indian students in the US
    అమెరికాలో అత్యధికంగా విదేశీ విద్యార్థులుండే తొలి ఐదు దేశాలు

ఇదీ చదవండి: భారత్​కే కరోనా వస్తే... పరిస్థితి ఏంటి?

Last Updated : Mar 2, 2020, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.