ETV Bharat / bharat

మధుమేహాన్ని కట్టడి చేసే అద్భుత మిశ్రమం! - షుగర్​ వ్యాధి ఔషధాలు

మధుమేహాన్ని కట్టడి చేసేందుకు ఆయుర్వేద ఔషధాన్ని అల్లోపతి మందుతో కలిపి తీసుకోవడం ఉత్తమమని 'ఎయిమ్స్​' వైద్యుల పరిశోధనల్లో తేలింది. హిమాలయ ప్రాంతం నుంచి సేకరించిన మూలికలతో తయారైన బీజీఆర్​-34ను గ్లిబెన్​క్లమైడ్​ అనే అల్లోపతితో కలపడం ద్వారా.. వాటిలో యాంటీఆక్సిడెంట్​లు పుష్కలంగా ఉన్నట్టు వెల్లడించారు.

BGR-34 plus allopathic drug combo may be effective in diabetes management: Study
మధుమేహాన్ని కట్టడి చేసే ఆయుర్వేద, అల్లోపతి మిశ్రమం!
author img

By

Published : Jan 31, 2021, 9:28 AM IST

ఆయుర్వేద ఔషధం బీజీఆర్​-34ను గ్లిబెన్​క్లమైడ్​ అనే అల్లోపతి మందుతో కలిపి తీసుకుంటే మధుమేహాన్ని సమర్థంగా కట్టడి చేయవచ్చని 'ఎయిమ్స్​' వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. బీజీఆర్​-34ను హిమాలయాల్లోని ఎగువ ప్రాంతం నుంచి సేకరించిన మూలికలతో తయారుచేశారు. శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్ఐఆర్​) ఆధ్వర్యంలోని సెంట్రల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడిసినల్​ అండ్​ ఆరోమాటిక్​ ప్లాంట్స్​(సీఐఎంఏపీ), నేషనల్​ బొటానికల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​(ఎన్​బీఆర్​ఐ) శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధన అనంతరం ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు.

ఈ ఔషధంలో యాంటీఆక్సిడెంట్​ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్టు పేర్కొన్నారు పరిశోధకులు. ఫలితంగా గుండె ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్​ చేరదని చెప్పారు. గ్లిబెన్​క్లమైడ్​తో కలిపి దీన్ని తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది పరిశీలించేందుకు 'ఎయిమ్స్​' వైద్యులు ప్రయోగాలు జరిపారు. ఇందులో భాగంగా కొందరికి ఈ రెండు ఔషధాలను కలిపి ఇవ్వగా.. మరికొందరికి వేర్వేరుగా ఇచ్చారు. రెండు మందులను కలిపి తీసుకున్న వారిలో ఇన్సులిన్ స్థాయి మెరుగుపడిందని మధ్యంతర ఫలితాల్లో వెల్లడైంది. బీజీఆర్​-34కు కొలెస్ట్రాల్​ను తగ్గించే సామర్థ్యం ఉన్నట్టు కూడా తేలింది.

ఇదీ చదవండి: సూక్ష్మ తుంపర్లలోని వైరస్​ను హతమార్చే కొత్త సాధనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.