ETV Bharat / bharat

ప్రియురాలి తండ్రిని హత్య చేసిన వన్​సైడ్​ లవర్ - ప్రేమ పేరుతో హత్య

ప్రేమ పేరుతో దారుణానికి ఒడిగట్టాడు ఓ వన్​సైడ్​ లవర్. తన ప్రేమకు ఒప్పుకోలేదని ప్రియురాలి తండ్రిని నడిరోడ్డు మీదే ఇనుపరాడ్లతో కొట్టి చంపాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

Pagal Lover kills a girl's Father
ప్రియురాలి తండ్రి హత్య
author img

By

Published : Aug 24, 2021, 7:39 PM IST

కర్ణాటక బెంగళూరులోని నేలమంగళలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి తండ్రిని అత్యంత క్రూరంగా నడిరోడ్డుపై రాడ్లతో కొట్టి చంపాడు నరేశ్​ అనే యువకుడు.

తన ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో చెప్పేందుకు ప్రయత్నించగా.. ప్రియురాలి తండ్రి నాగప్ప అడ్డు చెప్పడం కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి కుమార్తెను కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తుండే వాడని పేర్కొన్నారు. నాగప్ప స్వస్థలం బళ్లారిలోని సిరుగుప్ప తాలుకా.

ఇదీ జరిగింది..

నరేశ్​ కొద్ది రోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కానీ ఆ యువతికి అబ్బాయిపై అలాంటి ఆలోచన లేదు. అయితే ఈ ప్రేమ వ్యవహారాన్ని అమ్మాయి తండ్రికి చెప్పి ఒప్పించుకోవాలనే ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే నాగప్ప ఇంటికి వెళ్లాడు. విషయం విన్న నాగప్ప అతని ప్రేమకు నిరాకరించారు. దీంతో తరువాతి రోజు ఉదయం బాధితుడు డ్యూటీకి వెళ్లే సమయంలో మాటు వేసిన నరేశ్​, అతని స్నేహితుడు.. ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేశారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: పెళ్లికి పిలవలేదని వరుడ్ని చితకబాదిన స్నేహితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.