ఆటో డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి అతడి పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు ఓ వైద్యుడు. బీరు సీసాలతో దాడి చేయటమే కాకుండా, బాధితుడిపై ముత్ర విసర్జన చేశాడు(Bengaluru crime news). ఈ ఘటన కర్ణాటక, బెంగళూరులో జరిగింది.
ఇదీ జరిగింది..
బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్న రాకేశ్ శెట్టి అనే వైద్యుడు.. పలుమార్లు బాధితుడు మురళి ఆటోలో ప్రయాణించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. నవంబర్ 4న మురళిని కంట్రీ క్లబ్‌కు బిర్యానీ పార్సిల్ తీసుకురావాలని చెప్పాడు రాకేశ్. ఆటో డ్రైవర్‌తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ మహేశ్ సైతం వెళ్లాడు. వచ్చేటప్పుడు ఆసుపత్రి నుంచి స్వామి అనే మరో వైద్యుడిని తీసుకురావాలని సూచించాడు.
ఆటో డ్రైవర్ మురళి కంట్రీ క్లబ్‌కు తిరిగి చేరుకున్న క్రమంలో.. ఆలస్యం ఎందుకు అయిందంటూ వాగ్వాదానికి దిగాడు రాకేశ్. ఆ తర్వాత దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాడు.
" కొన్ని రోజులుగా వైద్యుడు నాకు తెలుసు. క్లబ్‌కు బిర్యానీ తీసుకురావాలని నాకు చెప్పాడు. నేను అదే చేశాను. వారు అప్పటికే మద్యం సేవించి ఉన్నారు. నన్ను కూడా తాగాలని బలవంతం చేశారు. స్వామి అనే వైద్యుడిని తీసుకురావాలని చెప్పగా.. అలాగే చేశా. ఇక్కడికి రాగానే, ఆలస్యం ఎందుకైందని దాడి చేశారు. ఇతరుల ముందు అతని స్నేహితుడిని అవమానించానని ఆరోపించాడు. అలాగే నా కులం పేరుతో దూషించాడు. ఆ తర్వాత నన్ను బాత్రూమ్లో బంధించి.. బీర్ సీసాలు, ఇతర వస్తువులతో కొట్టారు. నా నోట్లో, శరీరంపై మూత్రం పోశారు. "
- మురళి, ఆటో డ్రైవర్.
ఆ మరుసటి రోజు ఈ సంఘటనపై బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మురళి. ప్రధాన నిందితుడు రాకేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు(bengaluru doctor arrested). మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: తాగి వేరే ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. చితకబాదిన యజమాని!