కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి గొంతు నులిమి హత్య చేశాడు ఓ ప్రియుడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులుకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు ఇద్దరు సెక్స్‌లో పాల్గొన్నట్లు పోస్టుమార్టం పరీక్షలో తేలింది.
ఇదీ జరిగింది
కేపీ అగ్రహారకు చెందిన మనోజ్.. శాలిని అనే యువతి ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ శాలిని ఇటీవలే మరో యువకుడితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం శాలిని ఇంటికి వచ్చిన మనోజ్.. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. దీనికి శాలిని ఒప్పుకోకపోవడం వల్ల ఆగ్రహించిన మనోజ్.. ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అగ్రహరలోని ఇంటికి వచ్చి ఆత్మహత్యకు యత్నించాడు మనోజ్.
శాలిని మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ పోస్టుమార్టం నివేదికలో విస్తుపోయే నిజం బయటపడింది. హత్యకు ముందు ఇద్దరు లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు పోస్టుమార్టం పరీక్షలో తేలింది. నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని డీసీపీ శ్రీనివాస గౌడ తెలిపారు. అతడు పూర్తిగా కొలుకున్న తర్వాత అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
మైనర్‌పై సామూహిక అత్యాచారం
ఉత్తర్‌ప్రదేశ్ బదాయూలో ఘోరం జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి మంగళవారం రాత్రి తల్లితో కలిసి బహిర్భూమికి వెళ్లింది. వీరిని గమనించిని నిందితులు తల్లిని కొట్టి.. బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లారు. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆరుగురు అత్యాచారం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
తల్లిని చంపి ముక్కముక్కలుగా నరికిన కూతురు
తల్లిని దారుణంగా హత్య చేసి ముక్కముక్కలుగా నరికింది ఓ కూతురు. అనంతరం శరీర భాగాలను కప్బోర్డ్, వాటర్ ట్యాంకులో దాచిపెట్టింది. ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 23 ఏళ్ల కుమార్తెను అరెస్ట్ చేశారు. శరీర భాగాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయని పోలీసులు చెప్పారు.
ఇవీ చదవండి : వ్యాపిస్తున్న హాంకాంగ్ ఫ్లూ.. పుదుచ్చేరిలో పాఠశాలలు బంద్
ఆస్కార్ తెచ్చిన ఆర్థిక సహాయం.. ఏనుగుల సంరక్షకులకు సీఎం బంపర్ ఆఫర్