ETV Bharat / bharat

138 బెట్టింగ్​ యాప్​లు, 94 లోన్​ యాప్​లపై నిషేధం.. కేంద్రం కీలక నిర్ణయం - హోంమంత్రిత్వ శాఖ ఇండియా

138 బెట్టింగ్​ యాప్​లు, 94 లోన్​ యప్​లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. చైనా సంబంధం ఉన్న యాప్​లపై ఈమేరకు అత్యవసర చర్యలు చేపడుతోంది.

ban-and-block-138-betting-apps-and-94-loan-lending-apps
భారత్​లో 138 బెట్టింగ్​ యాప్​లపై ప్రభుత్వం నిషేదం
author img

By

Published : Feb 5, 2023, 12:16 PM IST

Updated : Feb 5, 2023, 1:45 PM IST

దేశంలో 138 బెట్టింగ్​ యాప్​లపై ప్రభుత్వం నిషేధం విధించనుంది. 94 లోన్​ యప్​లనూ బ్యాన్ చేసేందుకు సిద్ధమైంది. కేంద్ర హోంశాఖ సిఫార్సు మేరకు ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనాతో సంబంధం ఉన్న యాప్​లపై అత్యవసరంగా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
చైనాతో సంబంధమున్న లోన్​ బెట్టింగ్​ యాప్​లపై నిషేధం విధించాలని ఈ వారమే కేంద్ర హోంశాఖ సిఫార్సు చేసిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆ సూచనల మేరకే ఈ నిషేధం విధించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు ఈ యాప్‌లు విఘాతం కలిగిస్తున్నాయనే కారణంతో ఈ యాప్​లపై ప్రభుత్వం నిషేధం విధిస్తోంది.

"లోన్​ యాప్​లు మొదట అవసరమైన వారికి చిన్న మొత్తంలో రుణాలను అందిస్తున్నాయి. తర్వాత వారి నుంచి తీసుకున్న వాటికన్నా ఎక్కువ వసూళ్లు చేస్తున్నాయి. లోన్​ తీసుకున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వేధింపులకు పాల్పడుతున్నాయి. వీటిపైనా మాకు చాలా ఫిర్యాదులు అందాయి." అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందుకే వీటిపై నిషేధం దిశగా చర్యలు తీసుకున్నట్లు వివరించాయి.

చైనాకు చెందిన వారు ఈ యాప్​లను సృష్టించి.. భారతీయులను డైరెక్టర్​లుగా నియమించుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారి సూచనల మేరకే ఇక్కడ కార్యకలపాలు సాగుతున్నాయని వెల్లడించాయి. మొదట ఈ యాప్​లు డబ్బు అవసరం ఉన్న వారిని తక్కవ వడ్డీ రేట్లతో ఆకర్షిస్తాయని, తరువాత ఇచ్చిన దానికి 3వేల శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని సంబంధిత వర్గాలు వర్గాలు వివరించాయి.

"ఒకవేళ తీసుకున్న అప్పు కట్టలేక పోతే వ్యక్తిగతంగా ఫోన్​ చేసి దారుణంగా హింసిస్తారు. అసభ్యకరమైన మెసేజ్​లు, మార్ఫింగ్​ చేసిన నగ్న ఫోటోలు పంపిస్తారు. వాటిని బాధితుల మొబైల్​లో ఉన్న కాంటాక్ట్​లకు పంపిస్తాయని బెదిరిస్తారు. దీంతో యాప్​ల నుంచి అప్పు తీసుకున్న చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ఈ ఘటన ఎక్కువగా జరిగాయి." అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ, ఒడిషా, ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాలు, కేంద్ర నిఘా వర్గాలు ఈ లోన్​ యాప్​లు, బెట్టింగ్​ యాప్​లపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని పలు సార్లు కోరాయని వెల్లడించాయి.

ఈ ఫిర్యాదుల ఆధారంగానే కేంద్ర హోంశాఖ ఆరు నెలల క్రితం నుంచే 28 చైనీస్ లోన్ యాప్‌లను విశ్లేషించడం ప్రారంభించింది. అందులో 94 యాప్‌లు ఈ-స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయని, మరిన్ని థర్డ్-పార్టీ లింక్‌ల ద్వారా పనిచేస్తున్నాయని కేంద్రం గుర్తించింది. ప్రస్తుతం చాలా యాప్​లు​ స్మార్ట్​ ఫోన్​లలో డౌన్​లోడ్​ చేసుకోవడానికి అందుబాటులో లేవని, బెట్టింగ్​, గేమ్స్​ యాప్​లు వ్యక్తిగత లింక్​లు, వెబ్​సైట్ల ద్వారా డౌన్​లోడ్ అవుతున్నాయి కేంద్రం తెలిపింది.

గతంలోనూ పలు చైనా యాప్​లపై నిషేదం..
గతంలోను దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనాకు చెందిన 54 యాప్​లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అంతకముందు మరో 59 యాప్​లపైనా నిషేధం విధించింది. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, ఈక్వలైజర్ అండ్‌ బాస్ బూస్టర్, వివా వీడియో ఎడిటర్, యాప్‌లాక్, డ్యూయల్ స్పేష్ లైట్ వంటివి ఉన్నాయి. జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే కారణంతోనే 54 చైనా యాప్‌లపై నిషేధం విధించిట్లు అప్పుడు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

2021 జూన్‌లో టిక్‌టాక్‌, వీచాట్‌, హలో వంటి 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా 2021 జూన్‌ 29న ఆయా యాప్‌లను నిషేధించింది. తర్వాత సెప్టెంబరులో దేశ భద్రత, సార్వభౌమత్వం, సమగ్రత వంటి అంశాలకు భంగం కలిగిస్తున్నాయని మరో 118 చైనా యాప్‌లను కేంద్రం బ్యాన్​ చేసింది.ఆయా యాప్‌లు భారత్‌లో వినియోగదారుల డేటాను సేకరించి దేశం బయటకు అక్రమంగా తరలిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : Feb 5, 2023, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.