ETV Bharat / bharat

Chandrababu Bail petition in ACB court: చంద్రబాబుకు బెయిల్​పై ఏసీబీ కోర్టులో పిటిషన్.. రేపు విచారణ - ACB Court

Chandrababu_Bail_petition_in_ACB_court
Chandrababu_Bail_petition_in_ACB_court
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 6:38 PM IST

Updated : Sep 14, 2023, 7:35 PM IST

18:32 September 14

Chandrababu Bail petition in ACB court : పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు

Chandrababu Bail petition in ACB court : చంద్రబాబుకు బెయిలు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో గింజుపల్లి సుబ్బారావు అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుపై సీఐడీ మోపిన అభియోగాలు నిరాధారమని పేర్కొంటూ సుబ్బారావు ఈ పిటిషన్ వేశారు. ఆయన పేరు ఎఫ్ఐఆర్ (FIR) లో పేర్కొనకుండానే రిమాండ్ రిపోర్టులో ఆయన పేరును ఏ37గా పేర్కొంటూ సీఐడీ ఈ కేసు దర్యాప్తు చేస్తోందని.. దురుద్దేశపూర్వకంగానే ఈ కేసు నమోదైందని సుబ్బారావు తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ చేసి చంద్రబాబుకు బెయిలు (Bail) మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్​ను విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court).. దీనిపై రేపు విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్​కు సంబంధించి ఏపీ సీఐడీకి నోటీసులు జారీ చేసింది. గతంలోనూ రెండు రోజుల క్రితమూ చంద్రబాబుకు బెయిలు ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్త మహేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ రెండు పేజీలు మాత్రమే ఉండటం తదితర కారణాల రీత్యా సదరు పిటిషన్ ను తోసిపుచ్చింది. అయితే న్యాయవాది జి. సుబ్బారావు దాఖలు చేసిన పిటిషన్​ను మాత్రం స్వీకరించిన ఏసీబీ కోర్టు.. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు సీఐడీకి నోటీసులు జారీ చేసింది.

Petition in High Court on Chandrababu Arrest: చంద్రబాబు తరఫున హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌.. విచారణ రేపటికి వాయిదా

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలని సీఐడీ కోరడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సీఐడీ (CID) విజ్ఞప్తి మేరకు విచారణకు ఒక్కరోజు ముందు వరకు కౌంటర్‌ దాఖలుకు సమయమిచ్చింది. ఈ నెల 18 లోగా కౌంటర్‌ వేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఏసీబీ కోర్టు (ACB Court)లో సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌ (Custody Petition) ను ఈ నెల 18 వరకు విచారించవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసిన విషయాన్ని.. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు సీఐడీ పిటిషన్‌పై ఎలాంటి విచారణ జరపవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Chandrababu Case Arguments : చంద్రబాబుపై కేసు రాజకీయ ప్రేరేపితం.. ఆధారాల్లేకుండానే సెక్షన్-409 ఎలా..? : సిద్ధార్థ లూథ్రా

Amaravati Inner Ring Road Case: రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు పిటిషన్‌పై విచారణ సైతం ఈ నెల 19కి వాయిదా పడింది. సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు (Chandrababu) తరఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా.. కౌంటర్‌ దాఖలుకు సీఐడీ సమయం కోరింది. రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టులో బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరపనుండగా.. కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరింది.

CID Investigation in Chandrababu Case: అంతా స్క్రిప్ట్​ ప్రకారమే.. ఎంచుకున్న వారిపైనే కేసులు, అరెస్టులు

Last Updated : Sep 14, 2023, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.