వాషింగ్ మెషిన్‌లో పడిపోయిన ఏడాదిన్నర చిన్నారి.. మృత్యువుతో పోరాడి గెలిచాడు. కోమాలోకి వెళ్లిన ఆ చిన్నారి తిరిగి కోలుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
వసంత్ కుంజ్‌కు చెందిన ఓ మహిళ.. తన ఇంట్లోని ఓ గదిలో ఉన్న టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేసి ఆన్ చేసి వెళ్లింది. ఆమెకు ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ఒక్కసారిగా గదిలో బాబు కనిపించలేదు. 15 నిమిషాల తర్వాత వాషింగ్ మెషిన్‌లో కనిపించాడు. ఆ తర్వాత వెంటనే వాషింగ్ మెషిన్‌లో నుంచి బాబు తీసి వసంత్‌కుంజ్‌లోని ఓ ఫోర్టిస్ ఆసుపత్రికి కుటుంబసభ్యుల సహాయంతో ఆమె తరలించింది.
హాస్పిటల్ ఐసీయూ వార్డులో ఆ చిన్నారి దాదాపు ఏడురోజులు కోమాలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అనంతరం 12 రోజులు వార్డులో ఉండి చికిత్స పొందాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే కుర్చీ సహాయంతో వాషింగ్ మెషిన్‌పైకి తమ కుమారుడు ఎక్కి ఉండవచ్చని చిన్నారి తల్లి తెలిపింది.
అయితే ఆ ప్రమాదం నుంచి చిన్నారి కోలుకోవడం అద్భుతమని వైద్యులు అన్నారు. హాస్పిటల్‌కు తీసుకుని వచ్చేటప్పుడు చిన్నారి.. అపస్మారక స్థితిలో ఉన్నాడని చెప్పారు. న్యుమోనియాతో పాటు జీర్ణకోశ ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు వెల్లడించారు. సబ్బు నీరు కారణంగా వివిధ అవయవాల పనితీరు చావా వరకు దెబ్బతిందని తెలిపారు. చిన్నారి కోలుకునేందుకు అవసరమైన యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్ సపోర్టు అందించినట్లు అన్నారు. క్రమంగా చిన్నారి కోలుకుని తన తల్లిని గుర్తుపట్టడం ప్రారంభించిన తర్వాత వెంటిలేటర్ తొలగించినట్లు డాక్టర్ హిమాన్షి జోషి వివరించారు.
ఇవీ చదవండి: