ETV Bharat / bharat

పసికందు సహా ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం

house catches fire
ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం
author img

By

Published : Mar 8, 2022, 9:40 AM IST

Updated : Mar 8, 2022, 10:02 AM IST

09:32 March 08

చిన్నారి సహా ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం

కేరళలోని తిరువనంతపురమ్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి 8 నెలల బాలుడు సహా ఒకే కుటుంబంలో మొత్తం ఐదుగురు సజీవ దహనమయ్యారు.

దవలపురమ్​, వర్కాల సమీపంలోని చెరున్నియూర్​కు చెందిన ప్రతాపన్​ ఇల్లు రాహుల్​ నివాస్​లో సోమవారం అర్ధరాత్రి 1.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఇంటి ముందు పార్క్​ చేసిన ఐదు ద్విచక్రవాహనాలు సైతం కాలిబూడిదయ్యాయి. ఇంట్లో చెలరేగుతున్న మంటలు, పొగను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ బృందాలకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

మృతులు ప్రతాపన్​(64), అతని భార్య షెర్లీ(53), చిన్న కుమారుడు అఖిల్​(25), పెద్ద కూమారుడి భార్య అభిరామి(24), అతని 8 నెలల కుమారుడు రయాన్​గా గుర్తించారు. తీవ్ర గాయాలైన ప్రతాపన్​ పెద్ద కుమారుడు నిఖిల్​ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ప్రమాదానికి ఇంట్లో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా భావిస్తున్నట్లు చెప్పారు పోలీసులు.

Last Updated : Mar 8, 2022, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.