ETV Bharat / bharat

మళ్లీ తెరపైకి బాబ్రీ కేసు.. తీర్పుపై రివ్యూ పిటిషన్.. కోర్టు కీలక వ్యాఖ్యలు

Babri masjid demolition: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్​ను క్రిమినల్ వ్యాజ్యంగా పరిగణించనున్నట్లు అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఆగస్టు 1న వాదనలు వినడం ప్రారంభించనున్నట్లు తెలిపింది.

babri masjid demolition
babri masjid demolition
author img

By

Published : Jul 18, 2022, 5:43 PM IST

Babri masjid demolition: వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో భాజపా అగ్రనేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్​ను క్రిమినల్ అప్పీలుగా పరిగణించనున్నట్లు అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఆగస్టు 1న ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు లఖ్​నవూ బెంచ్ స్పష్టం చేసింది.

అయోధ్య నివాసులైన హజీ మహమ్మద్ అహ్మద్, సయ్యద్ అఖ్​లాక్ అహ్మద్​ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇది విచారణయోగ్యమైన వ్యాజ్యం కాదని జస్టిస్ దినేశ్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ జులై 11నే జరగాల్సి ఉంది. పిటిషనర్ అభ్యర్థనతో జులై 18కి వాయిదా పడింది. అయితే, మరోసారి కేసును వాయిదా వేసేది లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదికి కోర్టు తేల్చిచెప్పింది.

కేసు నేపథ్యం ఇదీ..
1992 డిసెంబర్​ 6న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. దీనిపై విచారించిన సీబీఐ స్పెషల్​ కోర్టు.. అనేక సంవత్సరాల విచారణ అనంతరం 2020 సెప్టెంబర్ 30న తీర్పును వెలువరించింది.​ ఆనాటి ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్​, భాజపా సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషీ, ఎల్​కే అడ్వాణీ, ఉమా భారతి సహా పలువురిని నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు.​ న్యూస్​ పేపర్​ కటింగ్స్, వీడియో క్లిప్స్​ను సాక్ష్యాధారాలుగా పరిగణనలోకి తీసుకోమని చెప్పింది. మసీదు కూల్చివేతకు, కరసేవకులకు సంబంధం ఉన్నట్లు సీబీఐ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది.

ఇవీ చదవండి: ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్​ఖడ్ నామినేషన్

నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 12 మంది మృతి.. పలువురు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.