కేరళలో ఓ ఆటోవాలను అదృష్టం(kerala lottery result) వరించింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారిపోయాడ.
ఎలా సాధ్యమైంది?
ఓనం పండుగ సందర్భంగా నిర్వహించిన తిరుఓనమ్ బంపర్ లాటరీలో(thiruvonam bumper lottery winner) మరదుకు చెందిన ఆటోడ్రైవర్ జయపాలన్ కొనుగోలు చేసిన లాటరీ నంబర్ టీఈ 645465 లక్కీ డ్రాలో(kerala lottery result) గెలుపొందింది. దీంతో ఆయన రూ.12 కోట్లను గెలుచుకున్నాడు. కొచ్చిలోని కెనరా బ్యాంకులో ఈ టికెట్‌ను జయపాలన్ సమర్పించగా.. ఆయనను లాటరీ విజేతగా(kerala lottery result) ప్రకటించారు అధికారులు.
త్రిపునితురలోని మీనాక్షి లాటరీ షాపులో ఈ లాటరీ టికెట్టును కొనుగోలు చేశాడు జయపాలన్. గతేడాది ఓనమ్ బంపర్ లాటరీలో.. రూ.కోటి గెలుచుకున్న లాటరీ విజేత కూడా టికెట్‌ను ఇదే షాపులో కొనుగోలు చేయడం గమనార్హం.
పన్నులు తీసేసిన తర్వాత తిరుఓనమ్ బంపర్ లాటరీ విజేత జయపాలన్ ఖాతాలో రూ.7.56 కోట్లు చేరనున్నాయి. ఈ ఏడాది కేరళవ్యాప్తంగా 54లక్షల ఓనమ్ బంపర్ లాటరీ టికెట్లు అమ్ముడయ్యాయి.
ఇదీ చూడండి: చిన్నారికి వెంట్రుకలు తినే అరుదైన వ్యాధి- సర్జరీ చేసి చూస్తే..