ETV Bharat / bharat

'15కోట్ల మంది బాలలు, యువత చదువుకు దూరం' - కోట్ల మంది బాలలు చదువుకు దూరం

దేశంలో దాదాపు 15 కోట్ల మంది బాలలు, యువత చదువుకు దూరమైనట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) గురువారం 'ఉద్యోగ కల్పన, వ్యవస్థాపకత' అంశంపై నిర్వహించిన వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు.

education, children
చదువు, బాలలు
author img

By

Published : Aug 13, 2021, 7:31 AM IST

దేశంలో కనీసం 15 కోట్ల మంది బాలలు, యువత విద్యా వ్యవస్థకు దూరంగా ఉన్నారని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. దాదాపు 25 కోట్ల జనాభాకు ప్రాధమిక స్థాయి అక్షరాస్యత కూడా లేదన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) గురువారం 'ఉద్యోగ కల్పన, వ్యవస్థాపకత' అంశంపై నిర్వహించిన వార్షిక సమావేశంలో ఆయన ఈమేరకు మాట్లాడారు.

"దేశంలోని అన్ని రకాల పాఠశాలల్లో నమోదైన 8-22 ఏళ్ల మధ్య వయసు విద్యార్థుల సంఖ్య సుమారు 35 కోట్లు. దేశంలో ఆ వయసున్నవారి సంఖ్య దాదాపు 50 కోట్లు. అంటే 15 కోట్ల మంది బడికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక శ్రామికశక్తిని పెంచాలంటే వారందరినీ విద్యా వ్యవస్థలో భాగస్వాములను చేయాలి" అని ప్రధాన్‌ పేర్కొన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలో 19 శాతం అక్షరాస్యత ఉండగా 15 ఏళ్లలో అది, 80 శాతానికి చేరిందన్నారు. వందేళ్ల స్వాతంత్య్ర వేడుకల సమయానికి చేరుకోవాల్సిన లక్ష్యాలకు నూతన జాతీయ విద్యా విధానం దిక్సూచిలా నిలుస్తుందని చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ డిజిటల్‌ సాంకేతికత ద్వారా విద్యా సంస్థల సేవలు కొనసాగేలా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని, సాంకేతికత సమాజానికి కొత్త రూపునిస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:పేదల లబ్ధికి ప్రత్యక్ష బదిలీ- త్వరలో ఇ-రుపీ లావాదేవీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.