ETV Bharat / bharat

ఉపముఖ్యమంత్రిపై సీఎం భార్య రూ.100కోట్ల పరువు నష్టం దావా - మనీశ్ సిసోడియాపై పరువు నష్టం కేసు

Assam cm wife defamation case: దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం వేశారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్​.

assam cm wife defamation case
మనీశ్ సిసోడియాపై పరువు నష్టం కేసు
author img

By

Published : Jun 22, 2022, 5:37 PM IST

Assam cm wife defamation case: దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు నమోదైంది. అసోం ఆరోగ్య శాఖ మంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఉన్న సమయంలో ఆయన భార్య రినికి భుయాన్​కు అసోం ప్రభుత్వం కాంట్రాక్టులు కేటాయించినట్లు కొద్ది రోజుల క్రితం మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ మనీశ్ సిసోడియాపై రినికి భుయాన్ గువాహటి సివిల్ జడ్జ్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

కొవిడ్ కేసులు పెరిగిన సమయంలో మార్కెట్‌ రేటు కంటే అధిక ధరలకు పీపీఈ కిట్లను సరఫరా చేసేందుకు అసోం ప్రభుత్వం రిన్​కి భుయాన్ శర్మకు చెందిన కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చిందని మనీష్ సిసోడియా ఆరోపణలు గుప్పించారు. రిని​కి భుయాన్ శర్మ ఈ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకే 1500 పీపీఈ కిట్లు పంపిణీ చేసినట్లు మనీశ్ సిసోడియా విమర్శించారు. ఈ ఆరోపణలను ఖండించిన ఆమె పరువునష్టం దావా వేశారు.

ఇవీ చదవండి: 'మోదీజీ.. నల్లచట్టాల్లాగే 'అగ్నిపథ్'​ పథకాన్ని వెనక్కి తీసుకుంటారు'

'బలవంతంగా తీసుకెళ్లి ఇంజెక్షన్లు ఇచ్చారు'.. శివసేన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.