ETV Bharat / bharat

ఆశారాం బాపు ఆశ్రమం వద్ద బాలిక మృతదేహం.. కారులోనే కుళ్లిపోయి.. - ఆశారాం బాపు ఆశ్రమ సమీపంలో మైనర్ మృతదేహం

Asharam Bapu ashram: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు ఆశ్రమంలోని పార్కింగ్​ ప్రదేశంలో 13 ఏళ్ల బాలిక మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. బాలిక మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

minor deadbody
మైనర్ మృతదేహం
author img

By

Published : Apr 9, 2022, 11:55 AM IST

Asharam Bapu ashram: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు ఆశ్రమం కారు పార్కింగ్ ప్రదేశంలో.. 13ఏళ్ల బాలిక మృతదేహం కనిపించింది. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆశ్రమాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గొండా జిల్లాలో జరిగింది. మృతురాలు ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదు. ఈ మేరకు ఏప్రిల్ 6న పోలీస్​ స్టేషన్​లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి ఉంటారని బాలిక తండ్రి అనుమాం వ్యక్తం చేశారు. ముగ్గురు వ్యక్తుల పేర్లతో ఏప్రిల్ 7న మరో ఫిర్యాదు అందించారు. మృతిచెందిన బాలిక కొత్వాలి గ్రామస్థురాలని పోలీసులు తెలిపారు.

ఈ కేసుపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తుండగానే బాలిక మృతదేహం కనిపించింది. గురువారం రాత్రి ఆశారాం బాపు ఆశ్రమం వెలుపల ఉన్న కారు నుంచి దుర్గంధం రావటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే.. పార్కింగ్ ప్రదేశంలో కుళ్లిపోయిన స్థితిలో గొండా-బహ్రిచ్​ రోడ్డులో మృతదేహం లభించింది. మృతురాలి తండ్రికి.. ముగ్గురితో భూతగాదాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కారణంగానే బాలిక హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: 'హైబ్రిడ్ ఉగ్రవాదుల కేసు'లో 25మందిపై ఎన్​ఐఏ ఛార్జ్​షీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.