Anticipatory Bail for Chandrababu in Angallu Case: అంగళ్లు ఘటనలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తైంది. బెయిల్ పిటిషన్‌పై ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును ఈ రోజుకి రిజర్వ్ చేసింది. ఈ మేరకు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. లక్ష రూపాయల పూచీకత్తుతో రెండు బాండ్లు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది.
అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో హైకోర్టులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మేరకు తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగస్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన అంగళ్లు మీదుగా వెళ్తుండగా అధికార వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఆ ఘటనపై కేసు నమోదు చేసిన కురబలకోట మండలం ముదివేడు పోలీసులు.. చంద్రబాబును ఏ1గా చేర్చడంతో పాటు మొత్తం 179 మందిపై కేసులు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు. దాంతో టీడీపీ నేతలు హైకోర్టులను ఆశ్రయించగా.. విచారణ అనంతరం కొందరికి బెయిల్ వచ్చింది.. కొద్ది రోజుల క్రితం మరికొంతమందికి బెయిల్ మంజూరైంది.
Chandrababu Anticipatory Bail Petition in High Court: ఈ నేపథ్యంలో అంగళ్లు ఘటనలో తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ.. చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో దురుద్దేశ పూర్వకంగా ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని ఆయన తరుపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
అధికార పార్టీకి చెందిన వారే చంద్రబాబుపైనే రాళ్లదాడి జరిగిందని, దాడిలో ఎన్‌ఎస్‌జీ గార్డులు ఆయనకు రక్షణ కల్పించారని తెలిపార. అందుకు సంబంధించిన వీడియోలను సైతం కోర్టుకు అందజేశారు. ఈ కేసులో మిగిలిన నిందితులకు బెయిల్ మంజూరైనట్లు గుర్తు చేశారు. తాజగా కొందరికి ముందస్తు, మరికొందరికి సాధారణ బెయిల్ మంజూరు చేశారని వివరించారు.
Chandrababu Illness In Jail: ఎండవేడిమి, ఉక్కపోతతో చంద్రబాబుకు అలర్జీ.. వైద్య పరీక్షలు
వైసీపీకు చెందిన వారు దాడులకు పాల్పడి 4 రోజుల ఆలస్యంగా తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. ఆలస్యానికి కారణాలు చెప్పలేదన్నారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిందని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలోమని సుప్రీం చెప్పిందని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యల కారణంగా దాడి జరిగిందని.. ముందస్తు బెయిల్ ఇవ్వద్దని పోలీసుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. చంద్రబాబు ప్రోద్బలంతో దాడి ఘటన చోటు చేసుకుందన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. చంద్రబాబు చెప్పాకే దాడులకు దిగారని.. పోలీసులకు గాయాలు అయ్యాయన్నారు. రాజకీయ ప్రతీకారంతో కేసు పెట్టామనడంలో నిజం లేదన్నారు. బెయిలు పిటిషన్ కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి.. తాజాగా వెలువరించింది.