ETV Bharat / bharat

మతం మారితే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ.50వేల ఫైన్​! - కర్ణాటకలో కొత్త బిల్​

Anti-conversion bill in Karnataka: బలవంతపు మతమార్పిడిలను అరికట్టేందుకు కొత్త బిల్లును.. ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లోనే తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. దీని ద్వారా మత మార్పిడిలకు పాల్పడితే గరిష్ఠంగా 10 ఏళ్లు జైలు శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించనున్నారు.

Anti-conversion Bill
మత మార్పిడి నిరోధక చట్టం
author img

By

Published : Dec 18, 2021, 12:02 PM IST

Updated : Dec 18, 2021, 12:24 PM IST

Anti-conversion bill in Karnataka: బలవంతపు మత మార్పిడిలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది కర్ణాటక ప్రభుత్వం. ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లోనే 'కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు-2021' తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.

రాజ్యాంగంలోని ఆర్టికల్​ 25 భారతీయ పౌరులు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు హక్కును కల్పిస్తోంది. అయితే, బలవంతపు మార్పిడులను నిషేధిస్తోంది. ఈ నిబంధనకు లోబడి.. బలవంతపు మత మార్పిడిలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించనుంది కర్ణాటక ప్రభుత్వం.

కొత్త బిల్​ ఏం చెబుతోంది?

కొత్త బిల్లు ప్రభారం బలవంతంగా, బెదిరించి మత మార్పిడికి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50వేల వరకు జరిమానా విధించనున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గంలోని మహిళలు, మైనర్లు, బధిరులను మతమార్పిడి చేస్తే కనీసం 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే, ఇతర కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులను ఇతర మతంలోకి మారేలా ప్రేరేపిస్తే.. గరిష్టంగా 5 ఏళ్ల జైలు, రూ.25వేల వరకు జరిమానా విధిస్తారు. సామూహిక మత మార్పిడిలు చేస్తే.. 3-10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

మతాన్ని మార్చాలనే ఉద్దేశంతో డబ్బులు, బహుమతులు, ఉపాధి, ఉచిత విద్య, వివాహాలు, మంచి జీవన విధానం వంటివి చూపించి ఆకర్షించే ప్రయత్నాలను సైతం నేరంగా పరిగణించనున్నారు. ఇలాంటి వాటిలో పాల్గొనే ఎన్​జీఓలు, మతపరమైన మిషినరీస్​, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధశరణాలయాలు, విద్యాసంస్థలకు నిధులను నిలిపివేయనున్నారు. బలవంతపు మత మార్పిడి ఏ విధానంగా జరిగినా నాన్​బెయిలెబుల్​ నేరంగా పరిగణిస్తారు. మతమార్పిడి నిరూపితమైతే.. బాధితుడికి రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు.

దేశంలో ప్రస్తుతం ఉన్న చట్టాలు..

భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్​ 295ఏ, 298 ప్రకారం.. బలవంతపు మతమార్పిడి అనేది నేరంగా పరిగణిస్తున్నారు. అయితే, చట్టవ్యతిరేకమని ఈ సెక్షన్లు నేరుగా చెప్పటంలేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఇలాంటి చట్టాలను తీసుకొచ్చాయి. స్వాతంత్ర్యానికి ముందు నుంచే పలు చట్టాలు అమలులో ఉన్నాయి. 1936లో రాయ్​గఢ్​ స్టేట్​ ట్రాన్స్​ఫర్​ యాక్ట్​, 1942లో పట్నా రిలీజియస్​ ఫ్రీడమ్​ యాక్ట్​, 1945లో సర్గుజా స్టేట్​ అపాలజెటిక్స్​ యాక్ట్​ వంటివి అమలు చేశారు.

ఇదీ చూడండి:

'లవ్ జిహాద్' ఆర్డినెన్స్ తెచ్చిన మధ్యప్రదేశ్​

బాలికతో మత మార్పిడి- యువకుడి అరెస్ట్​

'లవ్​ జిహాద్' ఆర్డినెన్సుపై మాయ అనుమానాలు

Last Updated : Dec 18, 2021, 12:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.