ETV Bharat / bharat

ANR 100th Birthday Celebrations at Annapurna Studio : 'అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు' - ఏఎన్​ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

ANR 100th Birthday Celebrations at Annapurna Studio : అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏఎన్​ఆర్ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అక్కినేని కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Akkineni Nageswara Rao centenary celebrations
Akkineni Nageswara Rao
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 10:50 AM IST

Updated : Sep 20, 2023, 2:34 PM IST

ANR 100th Birthday Celebrations at Annapurna Studio అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు

ANR 100th Birthday Celebrations at Annapurna Studio : అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏఎన్​ఆర్(ANR) విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) ఆవిష్కరించారు. ఏఎన్​ఆర్ శతజయంతి ఉత్సవాలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అల్లు అరవింద్‌, బ్రహ్మానందం, మురళీమోహన్‌, మోహన్‌బాబు, శ్రీకాంత్‌, జగపతిబాబు, రామ్‌చరణ్‌, మహేష్‌బాబు, రానా, విష్ణు, నాని, దిల్‌ రాజు, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, కీరవాణి, రాజమౌళి దంపతులు పాల్గొన్నారు.

Venkaiah Naidu on ANR 100th Birthday Celebrations : అక్కినేని నాగేశ్వరరావు అంటే తనకు చాలా అభిమానమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏఎన్​ఆర్ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోందని పేర్కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు, మహా మనిషి అని తెలిపారు. ఆఖరు రోజు వరకు నటించిన ఏకైక వ్యక్తి ఏఎన్​ఆర్ మాత్రమేనని చెప్పారు. సినిమా రంగంలో విలువలు ప్రదర్శించిన వ్యక్తి ఏఎన్​ఆర్ అన్నారు. అనేక విషయాలపై తాము ఇద్దరు చాలాసార్లు మాట్లాడుకునేవాళ్లమని గుర్తుచేశారు. ఏఎన్​ఆర్ చూపిన మార్గంలో నడవడమే.. ఆయనకు తామిచ్చే నివాళి అని పేర్కొన్నారు. ఆయన పెద్ద నటనా విశ్వవిద్యాలయమన్న మాజీ ఉపరాష్ట్రపతి.. తెలుగు ప్రజల హృదయాల్లో ఏఎన్​ఆర్ ఇంకా జీవించే ఉన్నారన్నారు. ఆయన జీవితాలను పరిపూర్ణంగా చదివారని వెంకయ్యనాయుడు వివరించారు.

ఎన్టీఆర్​ వల్ల ఏఎన్​ఆర్​ కడుపునిండా అన్నం తినేవారు కాదట!

Comedian Brahmanandam on ANR 100th Birthday Celebrations : అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడని సినీ హాస్యనటుడు బ్రహ్మానందం(Comedian Brahmanandam) అన్నారు. ఏఎన్​ఆర్ విగ్రహావిష్కరణ(ANR Idol Unveiling) చూడటమే మహాభాగ్యమని చెప్పారు. రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి ఏఎన్​ఆర్ చేరుకున్నారని గుర్తుచేశారు. అద్భుతమైన స్థితికి చేరుకోవడం సామాన్య విషయం కాదని పేర్కొన్నారు. నటన అనే చిన్న అర్హతతో ఏఎన్​ఆర్ మహోన్నత వ్యక్తిగా మారారని తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు సర్వసాధారణంగా ఉంటారని వివరించారు. ఏఎన్​ఆర్ క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుందని చెప్పారు. ఆయనకు వచ్చినన్ని అవార్డులు ఇంకెవరికీ రాలేదని తెలిపారు. అలాగే ఆయన పొందిన సన్మానాలు ఇంకెవరికీ జరగలేదని బ్రహ్మానందం హర్షం వ్యక్తం చేశారు.

Akkineni Nageswara Rao Centenary Celebrations : అక్కినేని నాగేశ్వరరావుతో చాలా చిత్రాలు చేయడం తన అదృష్టమని సీనియర్ సినీ నటి జయసుధ అన్నారు. ఏఎన్​ఆర్ నడిచే విశ్వవిద్యాలయమని పేర్కొన్నారు. అన్ని విషయాలపై నాగేశ్వరరావుకు అవగాహన ఉందని జయసుధ తెలిపారు. ఏఎన్​ఆర్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసి ఆరాధించానని దర్శకధీరుడు బాహుబలి, ఆర్​ఆర్ఆర్ ఫేమ్ రాజమౌళి అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు అందరికీ ఒక ప్రేరణనని జక్కన్న చెప్పారు. దేవుడిపై నమ్మకం లేకున్నా.. భక్తిరస చిత్రాల్లో అద్భుతంగా నటించారని తెలిపారు. ఏఎన్​ఆర్ ఒక గ్రంథం.. పాఠ్యపుస్తకమని సీనియర్ సినీ నటుడు మోహన్‌బాబు అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు జీవితం ప్రతిఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

'NTR అలా ఉండేవారు.. కానీ ANR కెమెరా ముందు ఒకలా బయట మరోలా..'

'దానవీరశూరకర్ణ'లో కృష్ణుడి పాత్ర చేయనన్న ANR.. ఎందుకో తెలుసా?

Last Updated : Sep 20, 2023, 2:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.