ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్డీ(రాష్ట్రీయ లోక్‌దళ్) మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది (RLD, SP alliance). వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ సింగ్ లఖ్‌నవూలో సమావేశమై ఎన్నికల పొత్తుకు అంగీకారానికి వచ్చారు.
సీట్ల సర్దుబాటు చర్చలు తుది దశలో ఉన్నట్లు జయంత్ సింగ్ చెప్పారు. ఇరుపార్టీల మధ్య ఎన్నికల పొత్తుకు (RLD, SP alliance 2022) సంబంధించి త్వరలో అధికార ప్రకటన చేయనున్నట్లు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తు (sp bjp alliance) ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మరోవైపు జయంత్‌సింగ్‌ను కలిసి ఫొటోను పోస్ట్ చేసిన అఖిలేష్ యాదవ్.. మార్పు కోసం ఆల్ఎల్డీతో జట్టు కట్టినట్లు ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:pm all party meeting: మోదీ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం!
'ఆ పార్టీ ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారు.. కానీ ఆ చెత్త మాకెందుకు?'