ETV Bharat / bharat

Omicron Variant News: అత్యంత ప్రమాదకరంగా ఒమిక్రాన్​.. ఇదే కారణం! - ఒమిక్రాన్​ వేరియంట్​ వార్తలు

AIIMS Chief on Omicron: ఎయిమ్స్​ చీఫ్​ డా. రణ్​దీప్​ గులేరియా.. కరోనా కొత్త వేరియంట్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్​ స్పైక్​ ప్రోటీన్​లో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఎన్ని ఎక్కువ మ్యుటేషన్లు ఉంటే.. టీకాల సామర్థ్యం అంత తగ్గిపోతుందన్నారు.

omicron variant news
ఒమిక్రాన్​ వైరస్​
author img

By

Published : Nov 28, 2021, 4:41 PM IST

Omicron India News: ఒమిక్రాన్​పై సర్వత్రా భయాందోళనలు నెలకొన్న తరుణంలో ఎయిమ్స్​ చీఫ్​ డా. రణ్​దీప్​ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త వేరియంట్​​ స్పైక్ ప్రోటీన్​లో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని తెలిపారు. దీంతో రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యం వైరస్​కు లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ స్పైక్​ ప్రోటీన్లే.. రోగి కణాల్లోకి చొచ్చుకెళ్లి, వైరస్​ వ్యాప్తికి కారణమవుతాయి. స్పైక్​ ప్రోటీన్​ శక్తిని తగ్గించేందుకు చాలా టీకాలు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. స్పైక్​ ప్రోటీన్లలో మ్యుటేషన్లు పెరిగిపోతే.. టీకాల సామర్థ్యం తగ్గిపోతుంది. అందువల్ల ఒమిక్రాన్​పై ప్రస్తుత వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని గులేరియా స్పష్టం చేశారు.

వైరస్​ వ్యాప్తి, రోగనిరోధక శక్తిపై కొత్త వేరియంట్​ పోరాడే తీరుపైనే భవిష్యత్​ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని తెలిపారు గులేరియా. ప్రస్తుతానికి ఒమిక్రాన్​ వేరియంట్​ను భారత్​లో గుర్తించలేదని, ఐఎన్​ఎస్​ఏసీఓజీ తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ ప్రయాణికులు, ముఖ్యంగా కొవిడ్​ కేసులు అనూహ్యంగా పెరిగిన దేశాల నుంచి వచ్చే ప్రజలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కొవిడ్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

కేంద్రం అప్రమత్తం...

ఈ కొత్త వేరియంట్​ను దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించారు. దీని తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్యనిపుణులు చెప్పారు. ఈ వేరియంట్​కు ఒమిక్రాన్​ అని పేరు పెట్టింది డబ్ల్యూహెచ్​ఓ. ఒమిక్రాన్​ కట్టడికి ఇప్పటికే అనేక దేశాలు చర్యలు చేపట్టాయి. వైరస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.

తాజా పరిస్థితులను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగా సన్నద్ధమవుతోంది. వైరస్​ నియంత్రణ కోసం విస్త్రతంగా సన్నద్ధమవ్వాలని, కట్టడి చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది(india omicron variant). ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​.. ఆయా ప్రభుత్వాలకు ఆదివారం లేఖ రాశారు. టీకా పంపిణీని మరింత వేగవంతం చేయాలని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రాలు కూడా ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాయి. విదేశాల నుంచి మహారాష్ట్రలోకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ వేయించుకోవాలని లేదా 72 గంటల ముందు ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలు(Maharashtra new covid guidelines today) జారీ చేసింది. దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి(Mumbai omicron) వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్​లో ఉండాలని... ముంబయి మేయర్ కిషోరి పెడ్నేకర్ స్పష్టం చేశారు. వారి నుంచి రక్తనమూనాలు తీసుకుని.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్​లకు పంపిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.