గుజరాత్‌లోని అహ్మదాబాద్(Gujarat Ahmedabad News) మున్సిపల్ కార్పొరేషను(ఏఎంసీ)లో కొన్ని ప్రాంతాలు కొవిడ్-19 వ్యాక్సినేషనులో వెనుకబడి ఉండటం వల్ల అధికారులు ప్రోత్సాహకాలు(Vaccine Offers) ప్రకటించి లక్ష్యసాధనకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మురికివాడల్లో కొన్నిచోట్ల ఈ వెనుకబాటు కనిపించగా మొదటి డోసు వ్యాక్సినేషనులో వందశాతం లక్ష్యాన్ని సాధించేందుకుగాను టీకా తీసుకున్నవారికి వంటనూనె ప్యాకెట్లు(Vaccine Offers) అందిస్తున్నారు.
లక్కీడ్రాపెట్టి రూ.10 వేల విలువ చేసే ఫోన్లు కూడా ఇస్తున్నారు. ఈ విధంగా శనివారం పది వేల వంటనూనె ప్యాకెట్లు పంపిణీ చేయగా.. ఆదివారం నాటికి ఆ సంఖ్య 20 వేలకు చేరింది. లక్కీ డ్రాలో(Vaccine Offers) 25 మంది ఫోన్లు గెలుచుకున్నట్లు ఏఎంసీ అధికారి తెలిపారు. ఈ ప్రయత్నంలో యువ అన్‌స్టాపబుల్ ఆర్గనైజేషన్ తమకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: భారత్ నుంచి 4 దేశాలకు 33 లక్షల కరోనా టీకాలు!
ఇదీ చూడండి: ఆ రోజు టీకా తీసుకుంటే.. వాషింగ్ మెషిన్, మిక్సర్ గ్రైండర్ ఫ్రీ!